అయోమయంలో ఎన్టీఆర్: ఆ ఛాన్స్ హీరో కార్తికేనా?

By Bojja Kumar

హైదరాబాద్: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్, నాగార్జున కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఆచరణకు సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ చిత్రంలో నాగార్జునకు తన పాత్ర నచ్చక పోవడంతో మార్పులు చేయమన్నారని, అయితే మార్పులు చేస్తే ఎన్టీఆర్ ఇష్ట పడం లేదని తెలుస్తోంది. తాజాగా కార్తీ పేరు కూడా తెరపైకి వచ్చింది.

దర్శకుడు వంశీ పైడిపల్లి తయారు చేసిన స్క్రిప్టుని విన్న నాగార్జున తన పాత్ర పరంగా మార్పులు చెప్పారని తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్ తగ్గించమని, తన వయస్సుకు తగినట్లు హుందాగా ఉండేలా డిజైన్ అడిగినట్లు చెప్తున్నారు. దాంతో వంశీ మళ్లీ తన రచయితలతో కూర్చుని కథలో మార్పులు చేసుకుంటూ వచ్చారని, దాంతో నాగార్జున ఇమేజ్ కు తగినట్లు తయారయినట్లు వినికిడి.

Karthi set to replace NTR Jr?

అయితే ఈ కొత్త వెర్షన్ లో చేసిన మార్పులుతో ఎన్టీఆర్ కు ప్రయారిటీ తగినట్లు గా రెడీ అయ్యిందని, విన్న ఎన్టీఆర్ మళ్లీ మార్పులు చెప్పాడని, మొదట చెప్పిన స్క్రిప్టే బాగుందన్నాడని చెప్పుకుంటున్నారు. అయితే నాగార్జున మొదట వెర్షన్ ఇష్టపడకపోవటంతో ఆ విషయం చెప్పారని, దాంతో హుందాగా నాగార్జున ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అయితే ఇటీవల ‘రభస' చిత్రం ప్లాపు కావడంతో మనసు మార్చుకున్న ఎన్టీఆర్ అసలు ఈ ప్రాజెక్టుకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టాక్. దీంతో మళ్లీ వంశీ పైడిపల్లి నాగార్జున ఒప్పించి ఎన్టీఆర్ స్థానంలో తమిళ హీరో కార్తిని తీసుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలో సనిమాకు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడిస్తానని నాగార్జున అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X