Karthika Deepam: సీనియర్ నటుడితో కార్తీక దీపం నటి ఎఫైర్.. షాకింగ్ గా రూమర్ వైరల్
తెలుగు బుల్లితెర ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షాకదరణ పొందిన సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ పై ఆడియెన్స్ రెస్పాన్స్, టీఆర్పీ పరంగా రికార్డులను తిరగ రాసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఈ సీరియల్ కు మహిళా లోకం మొత్తం ఫిదా అయిపోయింది. ఇక ఇందులోని హీరో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా సూపర్ పాపులారిటీ వచ్చింది.
రాష్ట్రం నోటా వంటలక్క అనిపించుకున్న ప్రేమీ విశ్వనాథ్ ఇప్పటికే నాగ చైతన్య సినిమాలో నటించే అవకాశం పొందింది. తదితర నటీనటులు కూడా పలు సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఇందులో దీపకు అత్తగా, కార్తీక్ కు తల్లిగా నటించిన సౌందర్యకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

తెలుగు మహిళా లోకం ఫిదా..
బుల్లితెరపై ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన సీరియల్ కార్తీక దీపం. తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ధారావాహిక ఇది. ఇక ఈ సీరియల్ లోని పాత్రలకు తెలుగు మహిళా లోకం ఫిదా అయింది. 2017 సంవత్సరంలో ప్రారంభమైన కార్తీక దీపం సీరియల్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

సౌందర్యకు కూడా ఎక్కడాలేని క్రేజ్..
ఇక ఈ కార్తీక దీపం సీరియల్ లోని వంటలక్క, డాక్టర్ బాబు అంటే గుర్తుపట్టని తెలుగు గృహిణి ఉండదంటే అతిశయోక్తికాదు. వాళ్లకు ఎంత పేరు వచ్చిందో ఆ సీరియల్ లోని మిగతా క్యారెక్టర్లయిన మోనిత, సౌందర్యకు కూడా ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది.

షాక్ ఇస్తున్న రూమర్స్..
అయితే తాజాగా కార్తీక్ కు తల్లిగా, దీపకు అత్తగా నటించిన ఈ సౌందర్య గురించి పలు రూమర్స్ షాక్ ఇస్తున్నాయి. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌందర్య అసలు పేరు అర్చన అనంత్. పేరుకు కన్నడ నటి అయినప్పటికీ తెలుగు బాగా నేర్చుకుని తెలుగు పేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు.

మరో వ్యక్తితో సన్నిహితంగా..
అర్చన అనంత్ పర్సనల్ విషయాలకొస్తే.. ఆమెకు భర్త, పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ప్రస్తుతం మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అర్చన అనంత్.. సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక సీనియర్ నటుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని టాక్ వినిపిస్తోంది.

వివాహేతర సంబంధాలు..
అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందనేది మాత్రం తెలియరాలేదు. కానీ ఇండస్ట్రీలో రెండు పెళ్లుల్లు, వివాహేతర సంబంధాలు సర్వసాధారణంగా జరిగేవే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా 1988 జనవరి 3న బెంగళూరులో జన్మించింది. అర్చన అనంత్ అక్కడే పుట్టి పెరగ్గా.. ఆమె తండ్రి అనంత వేలు ప్రముఖ కన్నడ నటుడు.

బ్యూటిషియన్ కోర్స్ చేసిన అర్చన..
అర్చన అనంత్ తండ్రి అనంత వేలు అనేక కన్నడ, తెలుగు సీరియల్స్ లో నటించారు. అర్చన అనంత్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బ్యూటిషియన్ కోర్స్ చేయగా, తల్లి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం కన్నడ, మలయాళం, తెలుగు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది అర్చన అనంత్.


Click it and Unblock the Notifications











