ఆ స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో శ్రీలీల? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బ్యూటీ!
టాలీవుడ్ టూ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు శ్రీలీల. తెలుగునాట చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకునేలా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఆషికీ 3లో నటిస్తోన్న శ్రీలీల మరికొన్ని క్రేజీ ఛాన్స్‌లు అందుకోవాలని భావిస్తున్నారు. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి శ్రీలీల డేటింగ్‌లో ఉందంటూ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. దానికి తగిన ఆధారాలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో శ్రీలీల విషయం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
శ్రీలీల డైరీ ఫుల్
సక్సెస్ ఉన్న వారికే సినీ పరిశ్రమలో డిమాండ్ ఎక్కువ. అలాంటిది చేసిన సినిమాలలో సగానికి పైగా ఫ్లాప్స్ ఉన్నప్పటికీ దర్శక నిర్మాతలు, హీరోలు శ్రీలీలే తమ సినిమాలలో కావాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ సరసన మాస్ జాతర, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, తమిళంలో పరాశక్తి, కన్నడంలో జూనియర్ సినిమాలు చేస్తున్న శ్రీలీల.. ఈ ఏడాది బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. కార్తీక్ ఆర్యన్ సరసన ఆషీకి 3లో నటిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

లెనిన్ నుంచి శ్రీలీల ఔట్
అక్కినేని అఖిల్ నటిస్తోన్న లెనిన్ సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నారు. అయితే వరుస సినిమాలతో బిజీ కావడం, డేట్స్ సర్దుబాటు చేయలేక శ్రీలీల ఇబ్బంది పడుతున్నారు. షూటింగ్‌కు ఆలస్యంగా వస్తుండటంతో పలుమార్లు లెనిన్ షూటింగ్ కూడా వాయిదా పడినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామాలతో శ్రీలీలను లెనిన్ మూవీ నుంచి మేకర్స్ తప్పించినట్లుగా కథనాలు వస్తున్నాయి. శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ బోర్సే లేదా మరో హీరోయిన్‌ను తీసుకున్నట్లుగా చిత్రసీమలో కథనాలు వచ్చాయి. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. శ్రీలీల తల్లి ఆమె డేట్స్ విషయంలో మీతిమీరి జోక్యం చేసుకోవడం కూడా ఆమె కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బాలీవుడ్‌పై శ్రీలీల ఫోకస్
సమంత, రష్మిక మందన్న మాదిరిగా తను కూడా బాలీవుడ్‌లో జెండా పాతాలని శ్రీలీల భావిస్తున్నారట. అందుకే హైదరాబాద్, బెంగళూరులలో కాకుండా ముంబైలోనే ఆమె ఎక్కువగా గడుపుతున్నారు. బాలీవుడ్ కుర్రహీరోల పక్కన శ్రీలీల బాగా సెట్ అవ్వడంతో పాటు ఆమెకున్న డ్యాన్సింగ్ స్కిల్స్ ప్లస్ పాయింట్స్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, పలు వ్యాపారాలతో శ్రీలీల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌తోనూ దుమ్మురేపుతోంది ఈ డాక్టరమ్మ. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్‌తో దేశాన్ని ఊపేసిన శ్రీలీల.. తాజాగా గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా నటించిన జూనియర్ మూవీలో ఆమె చేసిన సాంగ్ ఇటీవలి రిలీజై మంచి స్పందనను దక్కించుకుంది.
కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్
బాలీవుడ్‌లో యువ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమలో పడినట్లుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆషికీ 3 సినిమాలో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తుండగా.. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని అంటున్నారు. తనకు కాబోయే భార్య డాక్టరైతై బాగుండు అని కార్తీక్ తల్లి పబ్లిక్‌గా చెప్పడం, ఇటీవల జరిగిన వేవ్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె పక్కనే శ్రీలీల కనిపించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కార్తీక్ తల్లి కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అని బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కార్తీక్ - శ్రీలీల
తాజాగా కార్తీక్ ఆర్యన్ - శ్రీలీలలు ఓ రెస్టారెంట్‌కు వెళ్లి మీడియాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ముంబై నగరంలోని బాంద్రాలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరి ప్రేమ బంధం నిజమేనని, కార్తీక్ ప్రేమలో శ్రీలీల మునిగి తేలుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై కార్తీక్, శ్రీలీల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











