RX100 హీరోకు మరో లక్కీ ఛాన్స్..స్టార్ డైరెక్టర్ దృష్టిని ఆకర్షించిన యువ హీరో
Rx 100 సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న యువ హీరో కార్తికేయ తన టాలెంట్ తో చాలా కష్టపడి ఆఫర్స్ అందుకుంటున్నాడు. ప్రస్తుత జనరేషన్స్ కు తగ్గట్లుగా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఓ వర్గం ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాడు. నెక్స్ట్ చావు కబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. GA2 ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
సినిమాకు సంబంధించిన సాంగ్స్ టీజర్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక సినిమాను మార్చ్ 19న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. చూస్తూంటే కార్తికేయ ఈ సినిమాతో బాక్సాఫీస్ హిట్టు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. అయితే ఈ హీరోకు సుకుమార్ ఒక ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. సుకుమార్ రైటింగ్స్ లో ప్రస్తుతం ఆయన శిష్యులు మినీ బడ్జెట్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇక మరో యువ దర్శకుడు చెప్పిన కథ కోసం హీరో గురించి సెర్చింగ్ మొదలు పెట్టగా సుకుమార్ , కార్తికేయను సజెస్ట్ చేసినట్లు సమాచారం. సుకుమార్ రైటింగ్స్ తో పాటు GA2 పిక్చర్స్ కూడా ఆ సినిమాను సంయుక్తంగా నిర్మించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఉప్పెన సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అదే తరహాలో సుకుమార్ నుంచి మరో నలుగురు కొత్త దర్శకులు ఇండస్ట్రీకి రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











