'కాటమరాయుడు' పోయినా నమ్మకం ఉన్నట్లుంది.. అతడే కావాలంటున్న నితిన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నితిన్ ఎంతటి వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నితిన్ ప్రతి చిత్రంతో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన ఉంటుంది. నితిన్ ఛల్ మోహన్ రంగ చిత్రానికి పవన్ ఏకంగా నిర్మతగా మారాడు కూడా. కానీ ఛల్ మోహన్ రంగ చిత్రం ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. లై, ఛల్ మోహన్ రంగ చిత్రాల పరాజయం తరువాత నితిన్ తదుపరి చిత్రాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నితిన్ దిల్ రాజు నిర్మాణంలో శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నితిన్ నటిస్తున్నాడు. ఆగష్టులో ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉండగా నితిన్ ఆతరువాత నటించ బోయే చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

వరుస ప్లాపులు
త్రివిక్రమ్ తెరకెక్కించిన అ.. ఆ .. చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్ ఆ తరువాత రెండు వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన లై చిత్రం, పవన్ కళ్యాణ్ నిర్మాతగా రూపొందించిన ఛల్ మోహన్ రంగ చిత్రాలు పరాజయం చెందాయి.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌తో
కథలే బలంగా సినిమాలు నిర్మించే దిల్ రాజు నిర్మాణంలో నితిన్ ప్రస్తుతం నటిస్తున్నాడు. సతీష్ దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రాబోతోంది.

పవన్ కళ్యాణ్ దర్శకుడితో
నితిన్ నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, కాటమరాయుడు వంటి చిత్రాలు తెరక్కించిన డాలీ(కిషోర్ పార్థసాని) తో నితిన్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాటమరాయుడు తరువాత
డాలీ చివరగా తెరకెక్కించిన చిత్రం పవన్ కళ్యాణ్ కాటమరాయుడు. ఈ చిత్రం పరాజయం చెందింది. తమిళ చిత్రానికి ఇది రీమేక్. కాలం చెల్లిన కథ అయినప్పటికీ డాలీ చేయగలిందంతా చేశాడు. అతడిలో దర్శకత్వ ప్రతిభ పుష్కలంగా ఉందన్న మాట వాస్తవం. కానీ రీమేక్ దర్శకుడనే ముద్రని చెరిపేసుకోవాలి.

నమ్మకం ఉన్నట్లుంది
డాలీపై నితిన్ నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. నితిన్ సొంత నిర్మాణంలోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం పట్టలేమీదికి వెళితే నితిన్ నాలుగవ సారి పవన్ కళ్యాణ్ దర్శకులతో పనిచేసినట్లు అవుతుంది. గతంలో కరుణాకరన్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటించాడు.
Dil Raju Wantedly created A Scene In Fidaa Movie
Dil Raju Wantedly created A Scene In Fidaa Movie


Click it and Unblock the Notifications











