ప్రియుడితో కలిసి ఏకాంతంగా ఎంజాయ్ చేసేందుకేనా?
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఇద్దరూ విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా మీడియాకు లీక్ అయ్యాయి. దీంతో ఇద్దరూ ఇబ్బంది పడ్డారు.
ఈ రోజు కత్రినా కైఫ్ బర్త్ డే. దీంతో ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు ప్లాన్ చేసుకుందట కత్రినా. గతంలో మాదిరి ఎవరి కంట పడకుండా, ఫోటోలు బయటకు లీక్ కాకుండా పుట్టినరోజు సంబరాలు జరుపుకోవాలని ప్లాన్ చేసారు. ఫ్రాన్స్‌లోని సార్సికా అనే ఓ ద్వీపంలో పుట్టినరోజు సంబరాలకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ద్వీపంలో వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. సామాన్య భారతీయ యాత్రికులెవరూ ఈ దీవిని సందర్శించే వీలుండదని, అలాగే మీడియా దృష్టి నుంచి కూడా తప్పించుకోవచ్చని భావించిన ఈ ప్రేమజంట ద్వీపంలో పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు.
కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రణబీర్ కపూర్ తల్లిదండ్రులతో పాటు కత్రినా కైఫ్ కుటుంబ సభ్యులు కూడా వీరి వివాహానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి విషయంలో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











