»   » రణబీర్‌తో కలిసి గణేష్ పూజలో పాల్గొన్న కత్రినా కైఫ్

రణబీర్‌తో కలిసి గణేష్ పూజలో పాల్గొన్న కత్రినా కైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి వీరు గణేష్ ఉత్సవాల సందర్భంగా కలుసుకోవడం చర్చనీయాంశం అయింది. కొన్ని రోజుల క్రితం కత్రినా తన మాజీ బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగిన గణపతి ఉత్సవాలకు హాజన సంగతి తెలిసిందే.

ఓ ప్రముఖ ఆంగ్లపత్రికలో వచ్చిన వివరాల ప్రకారం రణబీర్ కపూర్ ఫ్యామిలీ ఇంట్లో గణేష్ చతుర్థి పూజా కార్యక్రమం నిర్వహించారని, 5 రోజుల పాటు వారి ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 14వ తేదీన కత్రినా వారి ఇంటికి వెళ్లి గణేషుడి పూజలో పాల్గొందని తెలుస్తోంది. చివరి రోజు సెలబ్రేషన్స్ కావడంతో అంతా భక్తి కార్యక్రమాలతో సందడిగా గడిపారని సమాచారం.

కత్రినా కైఫ్, రణబీర్ మధ్య ప్రేమ వ్యవహారం పీకల్లోతులో ఉందని స్పష్టం అవుతోంది. ఇటీవల వీరిద్దరు కలిసి స్పెయిన్ దేశం వెళ్లి జాలీగా ఎంజాయ్ చేసిన వచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా మీడియాలో లీక్ అయ్యాయి. ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ మాట్లాడుతూ తన జీవితంలో కత్రినా ఎంతో స్పెషల్ అని, ఆమె కోసమే తన జీవితం అని వెల్లడించారు. అయితే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను రణబీర్ ఖండించారు.

రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ కలిసి అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ చిత్రంతో పాటు రాజ్‌నీతి చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని, ఇద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్లో గుసగుసలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

English summary
The Ranbir Kapoor-Katrina Kaif love story once again hits the headlines. And this time, the couple has bonded over Ganpati Visarjan. Some days back, we heard that Kat paid a visit to her ex-boyfriend Salman Khan's home for Ganpati festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu