Katrina Kaif Pregnancy: గర్భం దాల్చిన కత్రినా కైఫ్? వైరల్ అవుతోన్న అతని పోస్ట్

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ స్టార్ కపుల్స్ అంతా గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఇటీవల కియారా అద్వానీ- సిద్ధార్ధ్ మల్హోత్రాల జంట పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. టాలీవుడ్‌లో లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ దంపతులు తాము తల్లిదండ్రుల కాబోతున్నట్లు ప్రకటించారు. వీరు కాకుండా పలువురు జంటల విషయంలోనూ ప్రెగ్నెన్సీ రూమర్స్ వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ జంట త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ కొట్టబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ఒక్క సినిమాలో నటించకుండానే ప్రేమలో
చిత్ర పరిశ్రమలో ఒకే సినిమాలో కలిసి నటించిన జంటల మధ్య ప్రేమలు, ఎఫైర్స్ నడుస్తుంటాయి. కానీ ఒక్క సినిమాలో కూడ కలిసి నటించకుండానే ఒక్కటయ్యారు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంట. అసలు వీరి ప్రేమ కథ ఎక్కడ? ఎప్పుడు? మొదలైంది అన్నది ఇప్పటికీ హాట్ టాపిక్కే. దర్శక నిర్మాత కరణ్ జోహార్ వల్లే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆయన హోస్ట్ చేసిన ఓ షోలో విక్కీ కౌశల్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. అతనితో కలిసి నటించాలని ఉందని చెప్పి బాంబు పేల్చింది. అయితే విక్కీతో పోలిస్తే అప్పటికే కత్రినా స్టార్ హీరోయిన్.

Katrina Kaif And Vicky Kaushal to expecting their first child umair sandhu post goes viral

అవార్డ్ వేడుకలో పెళ్లి ప్రపోజల్
ఆరేళ్ల క్రితం ఓ అవార్డ్ కార్యక్రమంలో తొలిసారిగా కత్రినా - విక్కీ కౌశల్ జంట కలుసుకున్నారు. ఆ సమయంలోనే ఏకంగా కత్రినాతో పెళ్లి ప్రపోజల్ పెట్టాడు విక్కీ. అయితే ఇదంతా సరదాగా చేస్తున్నారని బాలీవుడ్ జనాలు భావించారు. కానీ ఆ తర్వాతే అసలు ప్రేమకథ మొదలైంది. ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, అవార్డ్ ఫంక్షన్‌లో పక్కపక్కనే కూర్చోవడం వంటి చర్యలతో కత్రినా, విక్కీ మధ్య ఏదో జరుగుతుందన్న గుసగుసలు వినిపించాయి. కానీ ఇద్దరూ బయటపడలేదు. అయితే అనూహ్యంగా ఈ జంట తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు షాకింగ్ న్యూస్ చెప్పింది.

ఐదేళ్లుగా గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్
2021 డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు మూడు రోజుల పాటు రాజస్థాన్‌లోని ఓ పెద్ద ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయి దాదాపు ఐదేళ్లు కావొస్తున్నా విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఎప్పుడు శుభవార్త చెబుతారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు కత్రినా కైఫ్‌ ప్రెగ్నెన్సీపై రూమర్స్ రావడం అవి గాలి వార్తలుగా మారడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం కత్రినా కైఫ్ గర్భం దాల్చినట్లుగా బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

కత్రినా ప్రెగ్నెంట్ అంటూ గాసిప్స్
కత్రినా - విక్కీ కౌశల్‌లు ముంబై నుంచి అలీబాగ్‌కు ఫెర్రీలో ప్రయాణిస్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కత్రినా ధరించిన తెల్లటి చొక్కా చర్చనీయాంశమైంది. కేవలం ప్రెగ్నెంట్ అయినవారు మాత్రమే ధరించే ఈ చొక్కాను కత్రినా ఎందుకు ధరించారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వార్తలకు బలాన్ని చేకూర్చేలా సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కత్రినా కైఫ్ గర్భం దాల్చారని.. ప్రస్తుతం ఆమె రెండు నెలల ప్రెగ్నెంట్ అని ఉమైర్ సంధు పోస్ట్ పెట్టారు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. కత్రినా, విక్కీలలో ఎవరో ఒకరు స్పందించకుంటే ఈ వార్తలకు చెక్ పడే అవకాశం కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X