మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్న కత్రినా కైఫ్? ఆవిడే ఎందుకంటే..

దాదాపు 13 ఏళ్ల క్రితం క్రితం మల్లీశ్వరిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కత్రినా కైఫ్ ఆ తర్వాత బాలయ్యతో అల్లరి పిడుగు చేసింది. అయితే ఇక్కడ కెరీర్ గ్రోత్ ఆశించిన స్థాయిలో లేక పోవడం, బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడం, సక్సెస్ రేటు కూడా అక్కడే ఎకకువగా ఉండటంతో ఆమె హిందీ చిత్రసీమకే పరిమితం అయ్యారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...ఈ హాట్ లేడీ త్వరలో తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో కత్రినాను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారట.

కత్రినా ఫస్ట్ ఛాయిస్

కత్రినా ఫస్ట్ ఛాయిస్

‘మహర్షి' తర్వాత మహేష్ బాబు తర్వాతి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ‘మైత్రి మూవీ మేకర్స్' సంస్థ నిర్మించబోతోంది. కత్రినా లాంటి టాప్ హీరోయిన్ నటిస్తే సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సినిమా అలాంటిది కాబట్టే.... కత్రినాపై కన్ను

సినిమా అలాంటిది కాబట్టే.... కత్రినాపై కన్ను

"నేనొక్కడినే" తర్వాత సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే చిత్రం పీరియాడిక‌ల్ డ్రామాగా ఉండబోతోందట. ఇలాంటి కథకు కత్రినా పర్సనాలిటీ బాగా సూటవుతుందని, అందుకే ఆమెను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఎప్పడు మొదలవుతుంది?

ఎప్పడు మొదలవుతుంది?

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానుంది. ‘మహర్షి' షూటింగ్ పూర్తయిన తర్వాత సుకుమార్-మైత్రి మూవీస్ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

కత్రినా బిజీ బిజీ

కత్రినా బిజీ బిజీ

ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘భారత్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్లో ఈద్ సందర్బంగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X