తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. ఇక రెండేళ్ల పాటు అన్నిటికీ బ్రేక్?
కత్రినా కైఫ్ ఎప్పుడు శుభవార్త చెబుతుంది? అనే ప్రశ్న గురించి ఆమె అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి, బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియా భట్ తాను గర్భం దాల్చానని ప్రకటించినప్పటి నుంచి కత్రినా కైఫ్ గర్భధారణ గురించి వార్తలు మొదలయ్యాయి. కత్రినా తన గర్భం గురించి ఇంతవరకు ఎటువంటి శుభవార్తలను పంచుకోలేదు, అయితే నటి తల్లి కాబోతోందని మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

ప్రెగ్నన్సీ వార్త వెలుగులో
కత్రినా కైఫ్ చాలా కాలంగా మీడియా కంట పడటం లేదు. అందుకే ఆమె అభిమానులు కత్రినా గర్భవతి అని భావిస్తున్నారు. దీంతో వెంటనే ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే నిజానికి ఈ వార్తలు వైరల్ అయ్యాక కత్రినా విమానాశ్రయంలో కనిపించింది. ఆమె తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి మాల్దీవులలో తన పుట్టినరోజును జరుపుకున్న తర్వాత తిరిగి ముంబైలో కనిపించింది. విమానాశ్రయంలో కత్రినాను చూడగానే మరోసారి నటి ప్రెగ్నన్సీ వార్త వెలుగులోకి వచ్చింది.

బేబీ బంప్‌ను దాచడానికి
కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అని అభిమానులు వాదిస్తున్నారు, ఎందుకంటే కత్రినా మాల్దీవులకు వెళ్లి అక్కడి నుండి తిరిగి వచ్చే సమయంలో తన లుక్ క్యాజువల్‌గా ఉండేలా చూసుకుంది. విమానాశ్రయం నుండి బయటకు వచ్చిన కొత్త వీడియోలో, కత్రినా వదులుగా ఉన్న టీ-షర్ట్ - డెనిమ్‌లలో కనిపిస్తుంది. మాల్దీవులకు వెళ్లేటప్పుడు కూడా కత్రినా వదులుగా ఉండే దుస్తులు ధరించడంతో చాలా మంది ఆమె గర్భవతి అని భావించి తన బేబీ బంప్‌ను దాచడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

రెండేళ్లపాటు బ్రేక్
ప్రెగ్నెన్సీ పుకార్ల నేపథ్యంలో బాలీవుడ్ జ్యోతిష్యుడు సంజయ్ బి జుమానీ 2023లో కత్రినా తన మొదటి బిడ్డను విక్కీతో స్వాగతించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. కత్రినా తన బిడ్డను చూసుకోవడానికి రెండేళ్లు విశ్రాంతి తీసుకుంటుందని కూడా చెప్పాడు. "ఆమె ఇప్పుడు తన 40వ సంవత్సరంలో ఉందని అందుకే ఆమె వచ్చే సంవత్సరం బిడ్డకు జన్మనిస్తుందని పేర్కొన్నాడు. కత్రినా తన కెరీర్‌ను రాబోయే రెండేళ్లపాటు బ్రేక్ ఇచ్చి మరీ తన బిడ్డపై దృష్టి పెట్టే అవకాశం ఉంది, " అన్నారాయన.

కుటుంబ సభ్యులు మాత్రమే
ఇక 2010లో కత్రినా ఒక సంధర్భంలో మాట్లాడుతూ, తాను పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని, సంతోషంగా జీవించాలని కలలు కంటున్నానని చెప్పింది. గత ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో విక్కీ, కత్రినా పెళ్లి చేసుకున్నారు. చాలా సన్నిహితంగా జరిగిన వివాహ వేడుకకు వారి సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వేడుక ముగిసిన తరువాత, వారు హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. కొద్ది రోజుల్లో ముంబైకి తిరిగి వచ్చారు.

అధికారిక ప్రకటన మాత్రం
డిసెంబర్‌లో పెళ్లి తర్వాత ముంబైలోని జుహు ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ను కూడా అద్దెకు తీసుకున్నారు. ఇక ఆమె గర్భవతి అయ్యారు అంటూ స్వయం ప్రకటిత ఓవర్సేస్ క్రిటిక్ ఉమైర్ సందు పేర్కొన్నారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కత్రినా కైఫ్ గర్భవతి అయ్యిందని అంటూ ఆయన పేర్కొన్నారు కానీ దీనికి సంబందించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











