20కోట్లు అడిన కత్రినా? నిర్మాత పరారీ!
ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా తన హవా కొనసాగిస్తోంది కత్రినా కైఫ్. ఇటీవల తన వద్దకు వచ్చిన ఓ నిర్మాతకు తన రెమ్యూనరేషన్ భారీగా చెప్పి అతన్ని ఖంగు తినిపించిందట ఈ బ్యూటీ. మరి కత్రినా ఆ సినిమాకు అడిగిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 కోట్లు. బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం నిర్మాత వాసు భగ్నాని తను తీయబోయే తర్వాతి సినిమాలో తన కొడుకు జాకీ పక్కన హీరోయిన్‌గా నటించాలని ఆమెను సంప్రదించాడు. జాకీ పెద్దగా పేరు లేని నటుడు. ఇందులో కత్రినాను హీరోయిన్‌గా నటింప చేస్తే సినిమా బాగా ఆడుతుందని, తద్వారా తన కొడుకు సినిమా భవిష్యత్ మెరుగు పడుతుందని ఆ నిర్మాత ఆశ.
నిర్మాత ప్లాన్ ముందే గ్రహించిన కత్రినా పూర్తిగా తనకున్న ఇమేజ్ తోనే సినిమా నడుస్తుంది కాబట్టి తాను అడిగిన మొత్తం ఇవ్వాల్సిందే, అప్పుడే సినిమా చేయడానికి ఒప్పుకుంటానంటూ తెగేసి చెప్పిందట. ఇంకేముంది సినిమా మొత్తం తీయడానికి అయ్యే ఖర్చులో దాదాపు సంగం కత్రినాడిమాండ్ చేయడంతో సదరు నిర్మాత అంత మొత్తం ఇచ్చుకోవడానికి వెనకడుగు వేసి అక్కడి నుంచి పరారయ్యాడని బాలీవుడ్ గుసగుస.
కత్రినా లాంటి పెద్ద హీరోయిన్లను గోకి బొక్క పెట్టుకోవడం కంటే...కొత్త ముఖాలయితేనే బెటరని భావించిన వాసు భగ్నాన్ వారి కోసం వేట ప్రారంభించాడు.


Click it and Unblock the Notifications











