అమీర్ ఖాన్‌తో బికినీ విత్ రొమాన్సా? నోనో..
గతంలో వచ్చిన ధూమ్, ధూమ్2 సినిమాలు బాలీవుడ్‌లో భారీ బ్లాక్ బస్టర్స్‌గా పేలిన నేపథ్యంలో...థూమ్3 తీసేందుకు యశ్ రాజ్ ఫిలింస్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ లీడ్ రోల్ చేయబోతున్నారు. అమీర్ సరసన సెక్సీ క్వీన్ కత్రినా లీడ్ రోల్ చేస్తోంది. గతంలో వచ్చిన రెండు సిరీస్‌లలో ఇషా డియోల్, ఐశ్వర్యరాయ్, బిపాస బసులతో బికీని వేయించి రోమాన్స్ చేయించారు దర్శక నిర్మాతలు. తాజాగా ధూమ్3 లోనూ కత్రినాతో బికినీ వేయించి అమీర్ ఖాన్ తో రొమాన్స్ చేయించాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ ప్రతిపాదనను కత్రినా తిరస్కరించినట్లు బాలీవుడ్ టాక్.
తాను ఇప్పడు టాప్ హీరోయిన్ ప్లేసులో ఉన్నానని, రొమాన్స్ వరకు ఓకే గానీ, బికినీ మాత్రం వేయనుగాక వేయనంటూ నిర్మొహమాటంగా చెప్పిందట కత్రినా. అయితే ఐశ్కర్య రాయ్ అంతటి పెద్ద హీరోయిన్ ధూమ్2లో బికీనీ వేసింది, నీకెందుకంత టెక్కు అంటూ ఓ క్రమంలో దర్శకత నిర్మాతలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే యశ్ రాజ్ ఫిలింస్ కు చెందిన ఆదిత్య చోప్రా కత్రినాకు మంచి ఫ్రెండ్ కావడంతో కరీనాను మరీ బలవంతం పెట్టడం ఇష్టం లేక బికినీలు కాక పోయినా బికినీని తలపించే పొట్టి నిక్కర్లు ఆమెతో వేయించాలని నిర్ణయించారట. దీంతో కత్రినా బికీనీ అందాలు చూద్దామని ఎంతో ఆశతో ఉన్న అభిమానులకు నిరాశ మిగిలినట్లయింది.


Click it and Unblock the Notifications











