»   » రజనీకాంత్‌తో కత్రినా కైఫ్...విలన్ పాత్రలో హీరో విక్రమ్?

రజనీకాంత్‌తో కత్రినా కైఫ్...విలన్ పాత్రలో హీరో విక్రమ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శంకర్ దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘రోబో' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. సాంకేతికంగా అద్భుతమైన చిత్రంగా ఈ సినిమాకు పేరొచ్చింది. ఇందులో రజనీకాంత్ సరసన ఐశ్వర్యరాయ్ నటించడం బాలీవుడ్ మార్కెట్లో ఈ సినిమాకు ప్లస్సయింది.

త్వరలో రోబో చిత్రానికి సీక్వెల్ గా రోబో-2 ప్లాన్ చేస్తున్నాడు శంకర్. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఏమీ బయటకు పొక్కకుండా దర్శకుడు శంకర్ సీక్రెట్ మెయింటేన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలు ఎంత గోప్యంగా ఉంచుదామని ప్రయత్నించినా కొన్ని విషయాలు బయటకు లీక్ అవుతున్నాయి.

Katrina Kaif To Act With Rajinikanth?

తాజాగా అలా లీకైన విషయాల్లో హీరోయిన్ కత్రినా కైఫ్ విషయం కూడా ఒకటి. ప్రస్తుతం బాలీవుడ్లో ఫాంలో ఉన్న కత్రినాను హీరోయిన్ గా తీసుకోవడం వల్ల సినిమాకు బాలీవుడ్లో వసూళ్ల పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం ఆమెకు భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరో విక్రమ్ ప్రతినాయకుడి పాత్రలో నటించబోతున్నారట. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్నాన్ని 2016లో సెట్స్‌పైకి తీసుకురావాలని శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. నీరవ్ షా ఛాయాగ్రహణ బాధ్యతల్ని నిర్వహించనుండగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు.

English summary
Shankar's 'Robo 2' will go to the sets next year with Rajinikanth playing the lead and Vikram doing the villain role. Shankar who always prefers to take Bollywood top heroines for his movies has approached Katrina Kaif to play the main heroine role.
Please Wait while comments are loading...