»   »  మేకప్ మ్యాన్ కత్రినా కైఫ్ బండారం బయట పెడతాడా?

మేకప్ మ్యాన్ కత్రినా కైఫ్ బండారం బయట పెడతాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు ఇపుడు కొత్త భయం పట్టుకుందనే వార్తలు బాలీవుడ్లో ప్రచారంలోకి వచ్చాయి. గత 11 ఏళ్లుగా ఆమె వద్ద పని చేస్తున్న మేకప్ మ్యాన్ సుభాష్ సింగ్ తనకు సంబంధించిన విషయాలు బయటకు లీక్ చేస్తాడని ఆమె ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల షూటింగుకు లేటుగా వచ్చిన కారణంగా అతడిపై కత్రినాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఆమె వద్ద పని మానేసాడని అంటున్నారు. అంతటితో ఆగకుండా త్వరలో తాను ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు, దానికి మరాఠీ పిల్మ్ మేకర్ దర్శకత్వం వహిస్తాడని, సినిమా పరిశ్రమకు చెందిన వారిపై ఈ సినిమా ఉంటుందని ప్రకటించాడట.

Katrina's makeup artist turns producer

ఈ పరిణామాల నేపథ్యంలో సుభాష్ సింగ్ తీయబోయే సినిమా కత్రినా కైఫ్ పై సెటైరిక్ గా ఉంటుందని, ఆమెకు సంబంధించిన సీక్రెట్స్ అతను బయట పెట్టే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇపుడు బాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది.

ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖులు షబానా అజ్మీ, అనుపమ్ ఖేర్, జుహి చావ్లా, దివ్యా దత్తా నటిస్తున్నట్లు సమాచారం. కత్రినా కైఫ్ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ను సంప్రదిస్తే అతను తప్పకుండా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేయడానికి తప్పకుండా ఒప్పుకుంటాడని అని అంటున్నాడు. మరి కత్రినా నటిస్తుందా? లేదా? అనే విషయం చెప్పడానికి అతను నిరాకరిస్తున్నట్లు సమాచారం.

English summary
Subhash Singh has been the make-up artist for Katrina Kaif for the past 11 years. He was sacked by the Top Actress recently for being late to a shoot. This development garnered widespread media coverage only to irk the pretty beauty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu