KBC హోస్ట్‌గా MS Dhoni.. బిగ్ బి గుడ్ బైతో మరో ఇద్దరు స్టార్ హీరోలు రేసులో!

భారతీయ బుల్లితెరపై ఏళ్లకు ఏళ్లు నడుస్తూ నెంబర్ వన్ షోలుగా వెలుగొందుతున్న కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న కౌన్ బనేనా కరోడ్ పతి కూడా ఒకటి. దాదాపు 25 ఏళ్లుగా భారతీయులను ఆకట్టుకుంటోంది ఈ షో. మొత్తం 16 సీజన్ల పాటు నిరాటంకంగా కౌన్ బనేగా కరోడ్ పతి రన్ అయ్యింది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్‌ను బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడంతో పాటు ఇన్నాళ్లు కావొస్తున్నా ఆయన క్రేజ్ దగ్గకపోవడానికి కేబీసీ కూడా ఒక కారణమంటారు.

కేబీసీ అంటే మనకు టక్కున గుర్తొచ్చేది అమితాబ్ బచ్చన్. ఒకానొక దశలో వరుస ఫ్లాపులు, ఆర్ధికంగా నష్టాలతో అమితాబ్ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో బచ్చన్ కుటుంబాన్ని నిలబెట్టింది కౌన్ బనేగా కరోడ్‌పతి. రోటీన్ షోలకు భిన్నంగా జనరల్ నాలెడ్జ్, వినోదం, విజ్ఙానం కలబోతగా కేబీసీ ప్రాచుర్యం పొందింది. హాట్ సీట్‌లో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా హోస్ట్ చేసేవారు. ఆయన క్రేజ్, స్టైల్, అల్లరి ఈ షోకు ఎంతో ప్లస్‌గా మారి కేబీసీ అంటే అమితాబ్.. అమితాబ్ అంటే కేబీసీ అన్నట్లుగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

Kaun Banega Crorepati MS Dhoni or Two super stars may replace Amitabh bacchhan as Next KBC Host

కేబీసీ మాదిరిగా పలు షోలు టెలికాస్ట్ అయినా దాని స్థాయిలో అలరించలేక బొక్క బోర్లాపడ్డాయి. తెలుగులో కూడా కౌన్ బనేగా కరోడ్‌పతి మాదిరిగా మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రేక్షకుల ముందుకు ఓ షో వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవిలు తెలుగులో ఈ షోను హోస్ట్ చేశారు. అయితే కేబీసీ మాదిరిగా క్లిక్ కాలేకపోయాయి. కానీ హిందీలో మాత్రం అమితాబ్ బచ్చన్ సక్సెస్‌ఫుల్‌గా ఈ షోను నడిపిస్తున్నారు. అలాంటిది ప్రేక్షకులకు షాకిచ్చేలా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

16 రోజులు పూర్తి చేసుకున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా అమితాబ్ బచ్చన్ తప్పుకోనున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. అమితాబ్ ప్లేస్‌లో ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేబీసీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని వార్తలు వచ్చాయి. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు కూడా హోస్ట్ రేసులో వినిపించింది. అయితే గతంలో అమితాబ్ లేనప్పుడు సీజన్ 3కి బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. దీంతో నెక్ట్స్ సీజన్‌కు షారుఖ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి.

Kaun Banega Crorepati MS Dhoni or Two super stars may replace Amitabh bacchhan as Next KBC Host

ఈ పుకార్లపై అమితాబ్ బచ్చన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. 16వ సీజన్ చివరి ఎపిసోడ్ ముగిసే ముందు ఆయన మాట్లాడుతూ.. గత 16 సీజన్లుగా ఈ కార్యక్రమం విశేష ఆదరణ పొందిందని.. దాదాపు 25 ఏళ్లుగా నాపై అదే ప్రేమ, మద్ధతు చూపిస్తున్నారని వచ్చే సీజన్‌లో మిమ్మల్ని మళ్లీ కలుస్తానని అమితాబ్ పేర్కొన్నారు. అలాగే మనం మళ్లీ కలిసేవరకు ఈ సీజన్ నుంచి నిష్క్రమిస్తున్నానని బిగ్‌బీ తెలిపారు. దీంతో అన్ని పుకార్లకు చెక్ పడినట్లయ్యింది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కల్కి 2తో పాటు రామాయణ సినిమాలలో నటిస్తున్నారు. దీంతో పాటు కౌన్ బనేగా కరోడ్‌పతి తదుపరి సీజన్‌కు సిద్ధమవుతున్నారు.

More from Filmibeat

Read more about: kaun banega crorepati
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X