కౌశల్‌ని విలన్‌గా మార్చే ప్రయత్నం.. ఏకంగా బాలయ్యతోనే!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Kaushal Gets Offer From Boyapati Srinu

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ హౌస్ లో విజేత ఎవరో తేలిపోనుంది. కౌశల్, గీత మాధురి, తనీష్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు విజేతగా ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరు విజేతగా నిలిచినా బిగ్ బాస్ 2 నుంచి ఓ సూపర్ సెలెబ్రిటీ బయటకు రాబోతున్నాడు. అనుమానం లేకుండా అది కౌశల్ అనే చెప్పొచ్చు. బయట అతడికి లభిస్తున్న మద్దత్తు నిజంగా షాకింగే. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం బిగ్ బాస్ క్రేజ్ తో తన కెరీర్ లో కౌశల్ మరో లెవల్ కు వెళ్ళబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతు చిక్కని క్రేజ్

అంతు చిక్కని క్రేజ్

అసలు కౌశల్ కు ఇంత క్రేజ్ ఎలా ప్రారంభమైంది, ఒక్కసారిగా సోషల్ మీడియా, యువత అంతా ఎందుకు కౌశల్ జపం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ నిజాయతీయే అతడివైపు అందరిని ఆకర్షిస్తుందనేది కొందరి అభిప్రాయం.

క్రేజీ సెలెబ్రిటీలుగా

క్రేజీ సెలెబ్రిటీలుగా

బిగ్ బాస్ సభ్యులంతా బయటకు వచ్చాక క్రేజీ సెలెబ్రిటీలుగా మారిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కానీ వారి ఆ క్రేజ్ ని ఉపయోగించుకుని ఎలా కెరీర్ ప్లాన్ చేసుకుంటారు అనేదే కీలకం.

సిసలైన డైరెక్టర్ కంట్లో

సిసలైన డైరెక్టర్ కంట్లో

సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో కౌశల్ గురించి తాజగా మొదలైన ప్రచారం ఆసక్తికరంగా మారింది. అసలు సిసలైన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కన్ను కౌశల్ పై పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. తన చిత్రంలో కౌశల్ ని నటింపజేసేందుకు బోయపాటి తన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఏకంగా బాలయ్యతోనే

ఏకంగా బాలయ్యతోనే

బోయపాటి ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తదుపరి చిత్రం బాలయ్యతో ఉండనుంది. బాలయ్య సినిమాలో విలన్ పాత్ర కోసం బోయపాటి టీం కౌశల్ కుటుంబ సభ్యులని సంప్రదించారనేది లేటెస్ట్ టాక్. దేని గురించి అధికారిక సమాచారం బిగ్ బాస్ 2 ముగిసిన తరువాత బయటకు వచ్చే ఆవకాశం ఉంది.

దశ మారినట్లే

దశ మారినట్లే


గతంలో కౌశల్ కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలు మాత్రమే. కానీ బోయపాటి సినిమాలో ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. లెజెండ్ చిత్రంలో ఫ్యామిలీ హీరో జగపతి బాబుని భయంకరమైన విలన్ గా మార్చేశాడు బోయపాటి. ఆ చిత్రం తరువాత టాలీవుడ్ లో జగపతి బాబు విలన్ పాత్రలకు బ్రాండ్ గా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చూద్దాం.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కౌశల్ ఎలాంటి సంచలనాలు మొదలు పెడతాడో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X