మెగా హీరోతో బలగం బ్యూటీ రొమాన్స్.. కావ్య కల్యాణ్ రామ్‌కు బంపర్ ఆఫర్!

వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా సాంగ్ ను తెలుగు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ పాటలో పిల్లి కళ్ళతో ఒక చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి పేరును, గుర్తింపును తీసుకువచ్చాయి. ఆ చిన్నది ఎవరో కాదు.. తెలంగాణ పిల్ల కావ్య కళ్యాణ్ రామ్.

బాలనటిగా గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కావ్య.. ఈ సినిమా తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక బాలనటి నుంచి అమ్మడు హీరోయిన్ గా కూడా మారింది.

Kavya Kalyan got chance as heroine in Sai Tej movie

2020 లో మసూద అనే హారర్ చిత్రంతో ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కావ్య ఆ తర్వాత వేణు యేల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రియదర్శి సరసన ఈ చిన్నది నటించి మెప్పించింది . ఇక రెండు సినిమాలతో విజయాలతో పాటు అవార్డులు కూడా అందుకోవడంతో కావ్య ముందు ముందు స్టార్ హీరోయిన్ అవుతుందని అభిమానులు ఆశించారు.

అయితే ఈ రెండు సినిమాల తర్వాత కావ్య చేసిన మరో రెండు సినిమాలు పరాజయం పాలవడంతో కావ్య మళ్లీ వెనక్కి వెళ్ళిపోయింది ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా అమ్మడు తన జోరు చూపిస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకార కునుకు లేకుండా చేస్తుంది. ముద్దుగా బొద్దుగా ఉండడంతో అభిమానులు సైతం కావ్య అందాలకు ఫిదా అవుతున్నారు.

తాజాగా ఈ చిన్న దానికి మెగా ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే ఆయన సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అంటూ ఒక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయిందని సమాచారం అందుతుంది.

Kavya Kalyan got chance as heroine in Sai Tej movie

ఇక ఈ సినిమా ఆగిపోవడంతో తేజ్ మరో కొత్త సినిమాను లైన్లో పెట్టాడు. కొత్త దర్శకుడు రోహిత్ కు తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో తేజ్ సరసన కావ్య కళ్యాణ్ రామ్ ను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇది నిజంగా బలగం బ్యూటీకి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

మెగా కాంపౌండ్ లో ఈ బ్యూటీ అడుగుపెడితే అమ్మడికి ముందు ముందు మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇదే కనుక నిజమైతే కావ్య ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మంచిదని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాతో కావ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X