ప్రియుడితో కావ్య మారన్ రెడ్ హ్యాండెడ్‌గా.. మ్యూజిక్ డైరెక్టర్‌తో డేటింగ్ బట్టబయలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌తో టోర్ని ఆరంభం కావడంతో అందరి చూపు ఆ జట్టు యజమాని కావ్య మారన్‌పై పండింది. నాయకత్వ ప్రతిభ, బిజినెస్ స్ట్రాటెజీతోపాటు గ్లామర్‌తో ఆకట్టుకొంటున్న ఆమె ప్రస్తుతం మీడియా హెడ్‌లైన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సోషల్ మీడియాలో ఆమె డేటింగ్ వ్యవహారం గురించి నెటిజన్లు చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. గత కొద్దికాలంగా వినిపిస్తున్న అఫైర్ వార్తలకు బలం చేకూరేలా చేసింది. కావ్య మారన్ డేటింగ్, పెళ్లి రూమర్ల వివరాల్లోకి వెళితే..
గ్లామర్‌తో ఐపీఎల్‌కు క్రేజ్ తెచ్చిన కావ్య మారన్ గత కొద్దికాలంగా దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో సన్నిహితంగా ఉంటున్నారనే విషయం మీడియాలోను, సినీ పరిశ్రమలోను చర్చనీయాంశమైంది. అయితే తమ బంధం గురించి ఎన్ని వార్తలు, కథనాలు, రూమర్లు, గాసిప్ప్ వచ్చినా ఇద్దరు పట్టించుకొన్న దాఖలాలు లేవు. దాంతో ఆ ఇద్దరి డేటింగ్ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచేలా చేసింది.

అయితే కావ్య మారన్‌తో పెళ్లి వార్తలపై అనిరుధ్ మాత్రం ఓ సందర్భంలో అలాంటిదేమీ లేదు అనే విధంగా స్పందించాడు. దాంతో వారిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం అని అనుకొన్నారు. కానీ తాజాగా న్యూయార్క్‌లో ఇద్దరు కలిసి సన్నిహితంగా తిరుగుతూ ఓ ట్యూబర్ కెమెరాకు చిక్కారు. దాంతో వారిద్దరి మధ్య అఫైర్ వార్త మరోసారి మీడియాలో వెలుగు చూసింది. న్యూయార్క్ రోడ్లపై ఇద్దరు కలిసి ఉండటంతో వారిద్దరు తప్పించుకొనే పరిస్థితి లేకపోయింది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కానీ తమ బంధం గురించి, తమ రిలేషన్‌షిప్ గురించి కావ్య గానీ, లేదా అనిరుధ్ గానీ స్పందించాల్సిన అవసరం ఉందనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తమ రిలేషన్‌షిప్ గురించి వారిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే మాత్రం అది పెద్ద వార్తే అవుతుంది. అటు సినిమా రంగంలోను, క్రీడా రంగంలోని అభిమానులకు సెలబ్రేషన్స్ మొదలవ్వడం ఖాయమంటున్నారు.
న్యూయార్క్ ట్రిప్ తర్వాత తమిళ మీడియాలను, దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోను వారి పెళ్లిపై కథనాలు జోరందుకొన్నాయి. అనిరుధ్, కావ్య మారణ్ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వారిద్దరి మధ్య బలమైన రిలేషన్‌షిప్ ఉంది. దానిని ఎవరూ కాదనలేరు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఐపీఎల్ 2026 విషయానికి వస్తే.. SRH టీమ్ మొదట బ్యాటింగ్ చేసి జోరుగా పరుగులు సాధించింది. దాంతో కావ్య మారన్ టీమ్ శుభారంభాన్ని ఇచ్చిందనే అభిప్రాయం క్రీడాభిమానుల్లో వినిపించింది. అయితే బలమైన RCB జట్టును ఓడించి విజయయాత్రను మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. ఐపీఎల్ 2026 గురించిన వార్తలు, విశేషాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











