SRH ఓనర్‌తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ డేటింగ్.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారా?

సెలబ్రిటీల ప్రేమాయణాలు, పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ లేదా క్రికెట్ సెలబ్రిటీలు ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్త బయటకు వస్తే... అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అభిమానులు వారి ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పై కూడా తీవ్ర ఆసక్తి చూపుతుండటంతో, ఇలాంటి గాసిప్స్ మరింతగా ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ డేటింగ్‌లో ఉన్నారనే వార్త ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నిజంగానే ప్రేమలో ఉన్నారా? లేక ఇది కూడా మరో పుకారేనా? అన్న చర్చలు మొదలయ్యాయి.

ఐపీఎల్ సీజన్ వేడితో పాటు సోషల్ మీడియాలో మరో హాట్ టాపిక్ దుమ్మురేపుతోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు మ్యాచ్‌ల సమయంలో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కావ్య, ఇప్పుడు మ్యారేజ్ రూమర్స్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు.

Kavya Maran Dating Anirudh Viral Rumours Spark Marriage Buzz Across Social Media

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిరుధ్ రవిచందర్ తో కావ్య మారన్ డేటింగ్ లో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. అంతేకాదు ఈ ఏడాది చివర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, ఇరు కుటుంబాలు కూడా ఈ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు.

వాస్తవానికి, ఈ రూమర్స్ కొత్తవి కావు. గత ఏడాది నుంచే కావ్య- అనిరుధ్ మధ్య రిలేషన్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. విదేశాల్లో ఇద్దరూ కలిసి కనిపించారన్న వార్తలు, లాస్ వెగాస్‌లో డిన్నర్ డేట్స్‌కు వెళ్లారన్న కథనాలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌లో అనిరుధ్ వరుసగా పెద్ద సినిమాలకు మ్యూజిక్ అందించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.

ఇదిలా ఉంటే.. ఈ మ్యారేజ్ రూమర్స్‌కు మరో కొత్త ట్విస్ట్ కూడా జోడించబడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా ఈ పెళ్లి సంబంధం కోసం ముందుకొచ్చారనే వార్తలు తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. అనిరుధ్‌కు కుటుంబ సంబంధం ఉన్న రజనీకాంత్, ఈ అలయన్స్‌ను ఫైనల్ చేయడానికి కావ్య తండ్రి కళానిధి మారన్ తో మాట్లాడారనే గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ అంశంపై కూడా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక ఈ వార్తలపై అనిరుధ్ రియాక్షన్ కూడా ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పెళ్లి గురించి ప్రశ్నించగా, ఆయన నవ్వుతూ "ఇదు వేరా?" అంటూ సింపుల్‌గా దాటవేశారు. గతంలో కూడా సోషల్ మీడియాలో మ్యారేజ్ రూమర్స్‌ను కొట్టిపారేస్తూ "రూమర్స్ ఆపండి" అంటూ స్పందించారు. అటు కావ్య మారన్ మాత్రం ఈ విషయంపై ఎప్పటిలాగే సైలెంట్‌గానే ఉన్నారు.

ఇదే సమయంలో, ఈ ఇద్దరూ తమ తమ కెరీర్‌లతో బిజీగా ఉన్నారు. అనిరుధ్ ప్రస్తుతం ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతూ 'జైలర్ 2', 'కింగ్' వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు కావ్య మారన్, ఐపీఎల్ లో తన జట్టును విజయవంతంగా నడిపిస్తూ బిజినెస్ ఉమెన్‌గా సత్తా చాటుతున్నారు. అయితే, ఈ పెళ్లి వార్తలపై అభిమానుల్లో మిక్స్‌డ్ రియాక్షన్ కనిపిస్తోంది. కొందరు ఈ జంట నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆశపడుతుండగా, మరికొందరు ఇది కేవలం సోషల్ మీడియా సృష్టించిన పుకారే అని భావిస్తున్నారు.

ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ సమయంలో కావ్య మారన్ పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతుండటంతో, ఆమె క్రేజ్‌ను వాడుకునే ప్రయత్నమే ఈ రూమర్స్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది కేవలం గాసిప్‌గానే పరిగణించాలి. నిజంగానే ఈ ఇద్దరు ప్రముఖులు ఒక్కటవుతారా? లేక ఇది కూడా మరో వైరల్ రూమర్‌గా మిగిలిపోతుందా? అన్నది తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X