సినీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్న కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి నేత కెసిఆర్ త్వరలోనే మెగాఫోన్ పట్టి ఓ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు సమాచారం. పూర్తిగా తెలంగాణా స్లాంగ్ లో కేవలం తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం, తెలంగాణాపై పార్టీల వైఖరి, తెలంగాణా ఎందుకు రావాలి, వస్తే ఏమిటి ప్రయోజనం అన్న విషయాలను క్రోడీకరిస్తూ ఈ చిత్రం రూపొందనుందని వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ జరుగుతన్నట్లు చెప్పుకుంటున్నారు. పిక్షన్ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా నిజ జీవిత పాత్రలతో కెసిఆర్ రూపొందించే ఆలోచనలతో ఉన్నట్లు చెప్తున్నారు.
ఇప్పటివరకూ వచ్చిన తెలంగాణా చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం అక్కడ జన జీవితాన్ని ప్రతిబింబేలా రూపొందించాలని తలపోస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంతకుముందు తెలంగాణాపై సినిమాలు తీసిన వాళ్లు ఆయన మనస్సులోని భావనలు కరెక్టుగా పట్టుకుని ప్రెజెంట్ చేయలేకపోవటంతో తప్పని సరి పరిస్దితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వినికిడి. ఇక గతంలోనూ జై బోలో తెలంగాణా చిత్రానికి కెసిఆర్ ...గారడి చేస్తుండ్రు...గడిబిడి చేస్తుండ్రు పాటను రాసారు. అది బాగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణా ప్రాంత మనోభావాలను తెరకెక్కించి ఉద్యమానికి దృశ్య మాధ్యమం ద్వారాను ప్రాచుర్యం తేవాలని ఆయన ఆకాంక్ష అని కొందరు అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశముంది.


Click it and Unblock the Notifications











