సైరాకు కలిసొచ్చేలా ముఖ్యమంత్రి డిసీజన్.. సై సైరా అంటూ మెగా డిస్ట్రిబ్యూటర్లు!

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి' జోష్ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సరిగ్గా ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోబోతున్న ఓ నిర్ణయం 'సైరా నరసింహా రెడ్డి' సినిమాకు బాగా కలిసొస్తుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇంతకీ ముఖ్యమంత్రి తీసుకోనున్న ఆ నిర్ణయం ఏంటి? సైరాకు ఎలా ప్లస్ అవుతుంది? వివరాల్లోకి పోతే..

కంటిన్యూ అవుతున్న ఆర్టీసీ సమ్మె..

కంటిన్యూ అవుతున్న ఆర్టీసీ సమ్మె..

దసరా పండగకు ముందుగా చేపట్టిన ఆర్టీసీ సమ్మె నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై కేసీఆర్ సానుకూలంగా స్పందించక పోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఏర్పాటు చేసినప్పటికీ ప్రజల పాట్లు తప్పడంలేదు. ఆర్టీసీ బస్సులు నడవక ఇక్కడ ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి.

ఆలోచనలో పడిన కేసీఆర్.. చివరకు

ఆలోచనలో పడిన కేసీఆర్.. చివరకు

బస్సులు లేక జనం పడుతున్న ఇబ్బందులు గమనించిన కేసీఆర్ ఓ ఆలోచనకు వచ్చారని సమాచారం. ఊళ్లకు వెళ్లిన జనం తిరిగి వచ్చే పరిస్థితులు కష్టంగా మారడంతో దసరా సెలవులు మరో మూడు రోజుల పాటు పొడిగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశం 'సైరా' సినిమాకు బాగా ప్లస్ అవుతుందని టాక్ మొదలైంది.

సై సైరా అంటూ మెగా డిస్ట్రిబ్యూటర్ల ఆనందం

సై సైరా అంటూ మెగా డిస్ట్రిబ్యూటర్ల ఆనందం

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా నరసింహా రెడ్డి హవా నడుస్తోంది. దసరా సెలవులు రావడం, తొలి షోతోనే సైరాకు సక్సెస్ టాక్ రావడం కారణంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులకు తెరలేపింది సైరా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు రోజుల సెలవులు ప్రకటించడం సైరా కలెక్షన్లకు ప్లస్ అవుతుందని అంటున్నారు. దీంతో సై సైరా అంటూ సైరా డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సైరా యూనిట్‌కి పండగే

సైరా యూనిట్‌కి పండగే

దసరా సెలవుల పొడగింపు అంశం సైరా యూనిట్‌ మొత్తానికి పండగే అంటున్నారు సినీ విశ్లేషకులు. సైరా చూడని ప్రేక్షకులందరికీ ఇదో సువర్ణావకాశం అవుతుందని అంటున్నారు. ఒక రకంగా చిరంజీవికి ఇది కేసీఆర్ ఇచ్చిన బహుమతి అని కూడా కామెంట్ చేస్తున్నారు జనం.

Recommended Video

JAI JAI RAA NARSIMHA REDDY Event || Sye Raa Narasimha Reddy
తెలుగు రాష్ట్రాల్లో సైరా సునామీ

తెలుగు రాష్ట్రాల్లో సైరా సునామీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా నరసింహా రెడ్డి ఊచకోత నడుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల షేర్ రాబట్టి సరికొత్త రికార్డుల అడుగులు వేస్తుంది సైరా. ఇలాంటి సమయంలో మూడు రోజులు సెలవులు పెరిగితే వసూళ్లు కూడా భారీగానే పెరగడం ఖాయం. కేసీఆర్ నిర్ణయం సైరా డిస్ట్రిబ్యూటర్లలో ఆనందం చిగురింపజేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X