Just In
- 20 min ago
‘జబర్ధస్త్’ కమెడియన్లపై జానీ మాస్టర్ సీరియస్.. కొరియోగ్రాఫర్ దెబ్బకు భయంతో వణికిపోయారు.!
- 52 min ago
వెంకీ మామ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ ఎలా ఉందంటే!
- 1 hr ago
హాట్ టాపిక్ అవుతున్న నితిన్ లవ్ మ్యాటర్.. పెళ్లి చేసుకోబోయేది ఆమెనేనా.?
- 1 hr ago
అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్.. హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు బాధ్యతలు అప్పగించిన నాగ్
Don't Miss!
- Finance
మరో షాక్.. ఇన్ఫోసిస్‌లో నష్టపోయారా, ఇక్కడ కలవండి: అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా!
- News
సిద్ధరామయ్యకు అస్వస్థత, ఆస్పత్రిలో పరామర్శించిన సీఎం యడియూరప్ప, మంత్రులు
- Sports
15న తొలి వన్డే.. చెన్నై చేరిన కోహ్లీసేన!!
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 13-12-2019
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సైరాకు కలిసొచ్చేలా ముఖ్యమంత్రి డిసీజన్.. సై సైరా అంటూ మెగా డిస్ట్రిబ్యూటర్లు!
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి' జోష్ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సరిగ్గా ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోబోతున్న ఓ నిర్ణయం 'సైరా నరసింహా రెడ్డి' సినిమాకు బాగా కలిసొస్తుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇంతకీ ముఖ్యమంత్రి తీసుకోనున్న ఆ నిర్ణయం ఏంటి? సైరాకు ఎలా ప్లస్ అవుతుంది? వివరాల్లోకి పోతే..

కంటిన్యూ అవుతున్న ఆర్టీసీ సమ్మె..
దసరా పండగకు ముందుగా చేపట్టిన ఆర్టీసీ సమ్మె నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై కేసీఆర్ సానుకూలంగా స్పందించక పోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఏర్పాటు చేసినప్పటికీ ప్రజల పాట్లు తప్పడంలేదు. ఆర్టీసీ బస్సులు నడవక ఇక్కడ ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి.

ఆలోచనలో పడిన కేసీఆర్.. చివరకు
బస్సులు లేక జనం పడుతున్న ఇబ్బందులు గమనించిన కేసీఆర్ ఓ ఆలోచనకు వచ్చారని సమాచారం. ఊళ్లకు వెళ్లిన జనం తిరిగి వచ్చే పరిస్థితులు కష్టంగా మారడంతో దసరా సెలవులు మరో మూడు రోజుల పాటు పొడిగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశం 'సైరా' సినిమాకు బాగా ప్లస్ అవుతుందని టాక్ మొదలైంది.

సై సైరా అంటూ మెగా డిస్ట్రిబ్యూటర్ల ఆనందం
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా నరసింహా రెడ్డి హవా నడుస్తోంది. దసరా సెలవులు రావడం, తొలి షోతోనే సైరాకు సక్సెస్ టాక్ రావడం కారణంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులకు తెరలేపింది సైరా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు రోజుల సెలవులు ప్రకటించడం సైరా కలెక్షన్లకు ప్లస్ అవుతుందని అంటున్నారు. దీంతో సై సైరా అంటూ సైరా డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సైరా యూనిట్‌కి పండగే
దసరా సెలవుల పొడగింపు అంశం సైరా యూనిట్ మొత్తానికి పండగే అంటున్నారు సినీ విశ్లేషకులు. సైరా చూడని ప్రేక్షకులందరికీ ఇదో సువర్ణావకాశం అవుతుందని అంటున్నారు. ఒక రకంగా చిరంజీవికి ఇది కేసీఆర్ ఇచ్చిన బహుమతి అని కూడా కామెంట్ చేస్తున్నారు జనం.

తెలుగు రాష్ట్రాల్లో సైరా సునామీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా నరసింహా రెడ్డి ఊచకోత నడుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల షేర్ రాబట్టి సరికొత్త రికార్డుల అడుగులు వేస్తుంది సైరా. ఇలాంటి సమయంలో మూడు రోజులు సెలవులు పెరిగితే వసూళ్లు కూడా భారీగానే పెరగడం ఖాయం. కేసీఆర్ నిర్ణయం సైరా డిస్ట్రిబ్యూటర్లలో ఆనందం చిగురింపజేస్తోంది.