»   » 'మగధీర' ను రక్షించిన తెలంగాణ ధీరుడు ‘కెసిఆర్’ !

'మగధీర' ను రక్షించిన తెలంగాణ ధీరుడు ‘కెసిఆర్’ !

Posted By:
Subscribe to Filmibeat Telugu

అదుర్స్, ఆర్య 2 అడ్డుకొన్న కెసిఆర్ అండ్ గ్యాంగ్ ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన 'వరుడు" ను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ సందర్భంగా తన గ్యాంగ్ సభ్యులతో మాట్లాడుతూ రామ్ చరణ్ నటించిన ద్వితీయ చిత్రం 'మగధీర" సినిమా కొంచెం ముందుగా విడుదలై బ్రతికిపోయిందికానీ ఒక వేళ ఆలస్యం అయివుంటే తన ప్రతాపమేంటో చూపించేవాడినని కెసిఆర్ అంటేనే హడలి చచ్చేలా బెదరగొట్టే వాడినని వికటాట్టహాసం చేశాడట.

ఏదైతే ఏముంది ప్రస్తుతం విడుదలకు సిదమవుతున్న 'వరుడు" అడ్డుకొని తెలంగాణా వీరుల ప్రతాపమేంటో చూపిస్తామని చాలెంజ్ చేస్తున్నాడని సమాచారం. ఇది తెలుసుకొన్న తన గ్యాంగ్ లోని మరికొంత మంది సభ్యులు కేసిఆర్ మనస్సులో ఇంకా ఎన్ని కుట్రలు దాగి ఉన్నాయో తెలుసుకుందామని అతనితో పాటు మందుకొడుతూ కాలక్షేపం చేస్తున్నట్టు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu