రేప్ ల రాక్షసుడు వీడు... పరిచయం (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : కొందరు జీవిత చరిత్రలు తెరకెక్కితే రాబోయే తరాలకు ప్రేరణగా ఉంటాయి. మరికొన్ని మనుష్యులు ఉండకూడదో చెప్తాయి. అలాంటి జీవితాన్ని చూపిస్తూ ఓ చిత్రం కీచక టైటిల్ తో తెరకెక్కింది. జీవితాంతం రేప్ లు చేస్తూ చివరకు అత్యంత దుర్మరణం పొందిన రేపిస్టు అక్కు యాదవ్ లైఫ్ ని ఆధారం చేసుకుని నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలోని ప్రధాన పాత్రను పరిచయం చేస్తూ సాగిన వీడియో ఇక్కడ చూడండి.

ఆధునిక భారత దేశ చరిత్రలో అత్యంత దుర్మార్గులైన సైకో లలో ఒకడైన అక్కు యాదవ్ జీవిత గాధ ఆధారం గా నిర్మించ బడిన చిత్రం కీచక. అతని జీవితం అతనిలాంటి వాళ్లందరికీ ఒక గుణపాఠం గా మిగలాలి అన్న ఉద్దేశ్యం తో ఈ చిత్రాన్ని నిర్మించామని ఫిల్మ్ మేకర్స్ తెలియజేశారు. అయితే అంతటి దుర్మార్గుడి కథ ను తెరకు ఎక్కిస్తున్న సందర్భం లో కొన్ని చోట్ల హార్ష్ గా, మరికొన్ని చోట్ల వయోలెంట్ గా ఉండక తప్పలేదని వారు అన్నారు.

సెన్సార్ నుండి ఎడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం నిజానికి Grown Ups Only అని అభివర్ణించారు. ఈ చిత్రం కొంతమందిని అప్సెట్ చేస్తుంది. ఇంకొంత మందిని ఆలోచింపజేస్తుంది. మహిళలను వేధించే వారికి ఇదొక హెచ్చరిక లా తోస్తుంది.బాధితులకు ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అని మేకర్స్ చెప్పారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దాదాపు సినిమాలో 15 రేప్ సీన్స్ , అదీ బాగా వయిలెంట్ గా ఉన్న చిత్రం ఒకటి రీసెంట్ గా సెన్సార్ అయ్యిందని సమాచారం. ఈ చిత్రం పేరు కీచక. నాగపూర్ లో మూడు వందల మందిని రేప్ చేసిన ఓ రాక్షసుడి యదార్ద గాధ ఆధారంగా ఈ చిత్రం నిర్మించారని టాక్. దాంతో సినిమాలో అవకాసమున్న చోటల్లా రేప్ లు మెయిన్ క్యారెక్టర్ చేత చేయించేసారని తెలుస్తోంది. అదీ ఏ సింబాలిక్ గానో కాకుండా స్టెయిట్ గానే ఉన్నాయని చెప్తున్నారు.

అయితే అన్ని రేప్ లు ఉన్న సినిమాకి సెన్సార్ రావటానికి కారణం సినిమా చివర్లో ఏదో మెసేజ్ లాంటిది ఉందని అందుకే ఆపలేదని అంటున్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాక ఈ రేప్ సీన్స్ కు మహిళా సంఘాల నుంచి వివాదం ఎదురవుతుందేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 Keechaka Movie character introduction video

యామిని భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కీచక. కిశోర్ పర్వతరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌వీబీ చౌదరి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల్ని అరికట్టే క్రమంలో ఓ యువతికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. మహిళల్లో చైతన్యాన్ని కలిగించే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఆస్కార్ నామినేటెడ్ మిణుగురులు కథారచయిత ఎస్‌వీబీ చౌదరి దర్శకత్వ ప్రతిభ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే... సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో... ఆడియోను, సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ...‘‘సమాజంలో స్ర్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ స్ర్తీ చేసిన పోరాటమే ఈ సినిమా. వాస్తవిక సంఘటనలకు అద్దం పట్టేలా దర్శకుడు తీర్చిదిద్దనున్నారు. '' అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ... ''సమాజంలో స్త్రీలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. వీటిపై ఓ అమ్మాయి ఎలా స్పందించింది? ఎలాంటి పోరాటం చేసింది? అనే విషయాల్ని తెరపై చూపిస్తున్నాము ''అన్నారు.

జ్వాలా కోటి, యామినీ భాస్కర్‌, రఘబాబు, గిరిబాబు, వినోద్, నాయుడు, రోజా భారతి, బోసుబాబు, శ్రీహర్ష, ఝాన్సీ, మమత, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రజిత తదితరులు . ఈ చిత్రానికి మాటలు: రాంప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: కమలాకర్‌, సంగీతం: జోస్యభట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మోహన్‌ రావిపాటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X