కియారా అద్వానీపై కన్నేసిన చిరంజీవి టీమ్.. ఆచార్యలోకి అందాల భామ

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఆచార్య షూటింగ్ ఆగిపోయినప్పటికీ.. ఆ సినిమాలో కీలక పాత్ర ఎంపిక ప్రక్రియపై కసరత్తు భారీగానే జరుగుతున్నది. చిరంజీవి, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో లీడ్ హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో గెస్ట్ పాత్రలో రాంచరణ్ కనిపించబోతున్నారనే విషయం తెలిసిందే.

ఆచార్య విషయానికి వస్తే రాంచరణ్‌ విద్యార్థి నాయకుడిగాను నక్సలైట్ గాను రెండు కోణాలు ఉన్న పాత్రను పోషించనున్నారు. అయితే ఈ సినిమాలో పాత్ర కోసం మహేష్ బాబు పేరు వినిపించినప్పటికీ.. ఆ వార్తను స్వయంగా చిరంజీవి తోసిపుచ్చారు. అయితే RRR చిత్రంలో రాంచరణ్ నటిస్తున్నందున ఆ పాత్రను పోషిస్తారా? లేదా అనే మీమాంస కొనసాగించింది. చివరకు రాజమౌళిని ఒప్పించి ఆచార్యలో రాంచరణ్ పాత్రకు లైన్ క్లియర్ చేశారు.

Keerthy Suresh and Kiara Advani racing for Chiranjeevis Acharya

అలాంటి కీలక మైన పాత్రకు జోడిగా రాంచరణ సరసన నటించే హీరోయిన్ ఎంపికపై ఇప్పుడు దృష్టి పెట్టారు. రాంచరణ్ కోసం కియారా అద్వానీ, లేదా కీర్తీ సురేష్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం జరగలేదని తెలిసింది. త్వరలోనే ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసి వివరాలను మీడియాకు అందించాలని నిర్ణయించారు. గతంలో వినయ విధేయ రామలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో అనసూయను నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయింది. కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తే సెట్స్‌పైకి వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X