మన్మథుడు 2లో నాలుగో హీరోయిన్‌గా కీర్తీ సురేష్.. నాగ్‌ సరసన క్రేజీ రోల్!

Recommended Video

Keerthy Suresh To Join Manmadhudu 2 || Filmibeat Telugu

తెలుగు వారి అభిమాన నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సావిత్రి చిత్రం మహానటితో అందాల తార కీర్తీ సురేష్ కెరీర్ గ్రాఫ్ ఊహించనంత రేంజ్‌కు చేరుకొన్నది. విషాదం, భారమైన పాత్రను అవలీలగా పోషించి సినిమాను ఒంటిచేత్తో విజయం వైపు కీర్తి నడిపించింది. మహానటి చిత్రం తర్వాత వరుస అవకాశాలను, విజయాలను సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో దూసుకుపొతున్నారు. తాజాగా నాగార్జున సరసన నటించే అవకాశాన్ని దక్కించుకొన్నట్టు సమాచారం. వివారాల్లోకి వెళితే..

మహానటి తర్వాత స్టార్ హీరోలతో

మహానటి తర్వాత స్టార్ హీరోలతో

మహానటి తర్వాత విజయ్, విశాల్, విక్రమ్‌ లాంటి తమిళ అగ్రహీరోలతో జతకట్టింది. విజయ్‌తో సర్కార్, విశాల్‌తో పందెంకోడి సినిమాల్లో తన గ్లామర్, ప్రతిభతో మెప్పించింది. ఇక తెలుగులో నిర్మాత మహేష్ కోనేరు నిర్మిస్తున్న చిత్రంలో మంచి పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు నరేంద్రనాథ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే మరో షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నది.

హిందీలో అజయ్ దేవగన్‌ సరసన

హిందీలో అజయ్ దేవగన్‌ సరసన

కాగా, హిందీ భాషా చిత్రాల్లో కూడా కీర్తీ సురేష్ నటిస్తున్నది. అజయ్ దేవగన్ సరసన ఓ బయోపిక్‌లో కనిపించనున్నది. అజయ్ దేవగన్ ప్రియురాలిగా ఆమె నటిస్తున్నట్టు సమాచారం. అలాగే ప్రముఖ దర్శకుడు నాగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా క్రేజీ ప్రాజెక్టులతో స్పీడ్ పెంచిన కీర్తీ మన్మథుడు 2లో కూడా భాగమైందనే మాట వినిపిస్తున్నది.

 మన్మథుడు 2లో నాగార్జునతో

మన్మథుడు 2లో నాగార్జునతో

ప్రస్తుతం మన్మథుడు 2 సినిమా పోర్చ్‌గీస్‌లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రంలో నాగార్జున సరసన అతిథి పాత్రలో కనిపిస్తారట. ఇప్పటికే సమంత అక్కినేని తన వంతు పాత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకొన్నారు. త్వరలోనే కీర్తీ సురేష్ కూడా చిత్ర యూనిట్‌తో జతకలువనున్నారు. ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారనేది తాజా సమాచారం.

నలుగురు హీరోయిన్లతో నాగార్జున

నలుగురు హీరోయిన్లతో నాగార్జున

మన్మథుడు 2 చిత్రంలో భారీగా హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, అక్షర గౌడ లాంటి హీరోయిన్లు నటిస్తున్నారు. సమంత కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటం గమనార్హం. ఇక కీర్తీ సురేష్ రాకతో మరింత గ్లామర్ పాళ్లు పెరిగాయి. నటుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో పోర్చుగీస్‌లో సినిమా షూటింగ్ జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X