నేషనల్ అవార్డు విన్నర్‌తో ప్రభాస్ రొమాన్స్.. బడా డైరెక్టర్ భలే ట్విస్ట్ ఇచ్చాడుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా చేసి స్టార్లుగా ఎదిగిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ, టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్లు మాత్రం కొందరే ఉన్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అతడు.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నాడు.
'బాహుబలి' తర్వాత చాలా సినిమాలు చేసినా హిట్ కొట్టని ప్రభాస్ గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ', 'సలార్ 2', 'రాజా సాబ్' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న 'స్పిరిట్' సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా రోజులే అవుతోన్నా.. వీళ్లిద్దరూ వేరే వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం మొదలవలేదు. కానీ, ఈ చిత్రంపై అంచనాలు మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కించాలని ప్లాన్లు చేస్తున్నారు.
వైల్డ్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న 'స్పిరిట్' మూవీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో తెరకెక్కుతున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడుతున్నట్లు కూడా తెలిపాడు. ఇక, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుందని తెలిసింది.

ప్రభాస్ నటిస్తోన్న 'స్పిరిట్'లో హీరోయిన్‌గా ఎంతో మంది పేర్లను పరిశీలించారట. అయితే, ఇందులో కీర్తి సురేష్‌ను ఫైనల్ చేశారని తాజాగా తెలిసింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టును సందీప్ రెడ్డి వంగా ఆమెకు చెప్పినట్లు సమాచారం. ఇది బాగా నచ్చడంతో ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. త్వరలోనే కీర్తి సురేష్‌పై ప్రకటన చేయబోతున్నారని టాక్.
ఇదిలా ఉండగా.. పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'స్పిరిట్' మూవీని ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు కూడా తెలిసింది. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషన్ కుమార్ నిర్మిస్తోన్నారు.


Click it and Unblock the Notifications











