కీర్తి సురేష్‌కి నచ్చలేదట.. నాగార్జున ప్రాజెక్టు నుంచి అవుట్!
ఓ కొత్త సినిమా మొదలవుతుందంటే అది పట్టాలెక్కేవరకు తెలియదు ఎవ్వరు, ఎప్పుడు, ఎలాంటి ట్విస్టులు ఇస్తారో! మొదట నటించేందుకు ఓకే చెప్పి.. ఆ తర్వాత పాత్ర పరిధి నచ్చక ఎంతో మనది నటీనటులు వెనక్కి తగ్గడం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో అంతా ఓకే అనుకొని అడ్వాన్సులు కూడా తీసుకొని తప్పుకున్న నటీనటులు ఉన్నారు. తాజాగా అలాంటి ఓ చర్చనే ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం నాగార్జునతో కలిసి నటిస్తున్న కీర్తి సురేష్ ఆయన అప్‌కమింగ్ మూవీలో మాత్రం చేయలేనని కుండబద్దలు కొట్టేసిందట. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలు కానున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయనే రూపొందించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి సీక్వల్ గా 'బంగార్రాజు' పేరుతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉన్న ఈ చిత్రంలో ముందుగా ఒక హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. చిత్రంలో నాగచైతన్యకు జోడీగా ఈమె నటించనుందని అన్నారు.

ఈ పాత్ర కోసం అప్పట్లో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ అడగగానే ఓకే చెప్పేసిందట కీర్తి. కానీ తాజాగా కళ్యాణ్ కృష్ణ నారేషన్ విన్న కీర్తి.. తాను చేయలేనని ఓపెన్ గా చెప్పేసిందట. అందుకు కారణం కళ్యాణ్ కృష్ణ వినిపించిన కథలో కీర్తి సురేష్ పాత్ర పరిధి తక్కువగా ఉండటమే అని సమాచారం. కళ్యాణ్ కృష్ణ మరో హీరోయిన్ వేటలో పడ్డాడని తెలుస్తోంది.
మరోవైపు నాగార్జున, కీర్తి సురేష్ కలిసి ప్రస్తుతం మన్మథుడు2 చిత్రంలో నటిస్తున్నారు. మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











