Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్.. వరుడు బ్యాగ్రౌండ్ తెలిస్తే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతూ హవాను చూపిస్తుంటారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో ఏర్పరచుకుంటున్నారు. అలాంటి వారిలో మహానటి కీర్తి సురేష్ ఒకరు. ఆకట్టుకునే అందం.. మైమరపించే నటనతో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న కీర్తి సురేష్ పెళ్లి గురించి తాజాగా ఓ న్యూస్ నేషనల్ రేంజ్‌లో హైలైట్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

అలా పరిచయం.. టాలీవుడ్‌లోనూ

అలా పరిచయం.. టాలీవుడ్‌లోనూ


మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్.. అదే భాషలో 'గీతాంజలి' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమె ఫుల్ పాపులర్ అయింది.

మహానటి మూవీ.. నేషనల్ అవార్డ్

మహానటి మూవీ.. నేషనల్ అవార్డ్


తెలుగులో కీర్తి సురేష్ వరుస సినిమాలతో సత్తా చాటింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాలు కూడా చేసింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అదే సమయంలో ఆమెకు జాతీయ అవార్డు సైతం దక్కింది. ఇది ఆమె కెరీర్‌ను మార్చేసింది.

అన్ని భాషల్లోనూ.. ఫుల్ బిజీగా కీర్తి

అన్ని భాషల్లోనూ.. ఫుల్ బిజీగా కీర్తి

కెరీర్ ఆరంభంలోనే కీర్తి సురేష్ మలయాళం, తమిళంలో పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో అన్ని చోట్లా ఆమెకు ఆదరణ లభించడంతో వరుస ఆఫర్లు అందుకుంటోంది.

అతడితో డేటింగ్ చేస్తుందని టాక్

అతడితో డేటింగ్ చేస్తుందని టాక్


తరచూ ఏదో ఒక పర్సనల్ విషయాల కారణంగా కీర్తి సురేష్ వార్తల్లో నిలుస్తోంది. దీంతో అ అమ్మడు సినిమాల పరంగానే కాకుండా.. ఇలాంటి రూమర్ల వల్ల కూడా హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే దక్షిణాదిలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొందిన అనిరుథ్ రామచందర్‌తో కీర్తి సురేష్ ప్రేమాయణం సాగిస్తుందని కొద్ది రోజుల క్రితమే ఓ సెన్సేషనల్ న్యూస్ వైరల్ అయింది.

కీర్తి సురేష్ పెళ్లి.. పుకార్లు షికార్లతో

కీర్తి సురేష్ పెళ్లి.. పుకార్లు షికార్లతో


మహానటి కీర్తి సురేష్ దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను పెంచుకుని ముందుకు సాగుతోంది. అదే సమయంలో ఈమె పెళ్లి గురించి తరచూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో ఆమె ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయిందని ఓ న్యూస్.. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడిని వివాహం చేసుకోబోతుందని మరో వార్త.. ఇలా ఎన్నో కీర్తి సురేష్ గురించి ఫిలిం నగర్‌లో చక్కర్లు కొట్టాయి.

కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ అని న్యూస్

కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ అని న్యూస్


చాలా కాలంగా నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో కీర్తి సురేష్ పెళ్లి వార్త ఒకటి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్టార్ హీరోయిన్ వివాహం చేసుకోబోతుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్ త్వరలోనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోబోతుందట. ఈ నెలలోనే నిశ్చితార్థం కూడా చేసుకోబోతుందని తెలుస్తోంది.

వరుడి బ్యాగ్రౌండ్ ఇదేనంటూ

వరుడి బ్యాగ్రౌండ్ ఇదేనంటూ


ఇక, కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతోన్న నేపథ్యంలోనే.. ఆమెను మనువాడే వరుడి వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్‌ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వ్యాపార రంగంతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉండే పర్సన్ అని తెలుస్తోంది. అయితే, దీనిపై ఆమె సన్నిహితుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X