Just In
- 34 min ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 40 min ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
- 1 hr ago
అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
- 1 hr ago
మరోసారి మీ పాదాలను తాకాలని ఉంది.. ఎస్పీబీని తలుచుకుంటూ సునీత ఎమోషనల్
Don't Miss!
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- News
ఇస్రో నయా రికార్డ్: ఇక కమర్షియల్ రూట్: అమేజాన్-1 కక్ష్యలోకి
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కీర్తి సురేష్ అలా తయారవడంతో.. క్రేజీ ఆఫర్ దక్కించుకున్న ప్రియమణి
ఒకప్పుడు బిజీగా గడిపిన హీరోయిన్ ప్రియమణి.. మళ్లీ క్షణం తీరిక లేకుండా బిజీ అవుతోంది. ఈ మధ్య వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో అద్భుతమైన పాత్రను, అత్యద్భుతంగా పోషించి అందర్నీ ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా ఆదరణ పొందడంతో ప్రియమణి పేరు మార్మోగిపోయింది. ఇక సినిమాల్లోనూ కొత్త అవకాశాలు తెచ్చిపెట్టింది ఈ వెబ్ సిరీస్. ఓ వైపు సినిమాలతో మరోవైపు బుల్లితెర కార్యక్రమాలతో ఫుల్ బిజీగా మారింది ప్రియమణి. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కూడా ప్రియమణినే వరించిందని టాక్.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం నుంచి కీర్తి సురేశ్ తప్పుకోవడంతో ప్రియమణి వద్దకు ఆ పాత్ర వచ్చినట్టు టాక్. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ చేయబోతోన్న చిత్రం మైదాన్. భారత ఫుట్‌బాల్ మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. అజయ్‌దేవ్‌గణ్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో కీర్తి సురేశ్‌ను ఎంపిక చేశారు.

మొదటగా ఈ సినిమాలో కీర్తిని తీసుకున్నా.. ప్రస్తుతం ఆమె ఉన్న పర్సనాల్టీకి ఆ పాత్రకు సరిపోదని నిర్మాతలు భావించారట. కీర్తి ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ల కోసం జీరో సైజ్ మెయింటేన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా జీరో సైజ్‌లో ఉన్న కీర్తి.. అజయ్ దేవగణ్ పక్కన భార్య పాత్రకు సరిపోదని, ప్రియమణిని ఎంపిక చేసినట్టు సమాచారం. కాగా, ప్రసుత్తం ప్రియమణి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ 'తలైవి'లో శశికళ పాత్రను , అసురన్ రీమేక్‌లో వెంకటేష్ సరసన నటించనుంది.