రాజమౌళి నుంచి పిలుపు రాలేదు.... చివరకు కీర్తి సురేష్ ఏం చేసిందంటే?

Recommended Video

A R Murugadoss Brings Keerthy Suresh For Rajinikanth? | Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనే విషయం హాట్ టాపిక్ అయింది. తమిళ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.... ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మురుగదాస్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'సర్కార్' చిత్రంలోనూ కీర్తి హీరోయిన్‌గా చేసింది. ఆమె పని తీరు నచ్చడంతో పాటు రజనీకాంత్ సరసన తాను అనుకున్న పాత్రకు సూటవుతుందనే అభిప్రాయానికి మురుగదాస్ వచ్చినట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రాజమౌళి పిలుపు కోసం ఎదురు చూసినట్లు వార్తలు

రాజమౌళి పిలుపు కోసం ఎదురు చూసినట్లు వార్తలు

‘మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ఏ సినిమాకు కమిట్ కాలేదు. కొన్ని రోజుల క్రితం ఆమె ‘ఆర్ఆర్ఆర్' నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం రాజమౌళి నుంచి పిలుపు వస్తుందనే కీర్తి సురేష్ ఎదురు చూసినట్లు ప్రచారం జరిగింది.

రజనీకాంత్ మూవీ వైపే...

రజనీకాంత్ మూవీ వైపే...

‘ఆర్ఆర్ఆర్' సినిమా కోసం తన ఎదురు చూపులు ఫలించక పోవడం, మరో వైపు రజనీకాంత్‌తో చేసే అవకాశం దక్కడంతో కీర్తి సురేష్ ఫైనల్ నిర్ణయానికి వచ్చిందట. సూపర్ స్టార్ సినిమా మిస్సయితే ఇక జీవితంలో అలాంటి ఛాన్స్ రాదని, అందుకే మురుగదాస్ ప్రతి పాదనకు ఓకే చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 రొమాంటిక్ సాంగ్స్, సీన్లకు దూరంగా రజనీకాంత్

రొమాంటిక్ సాంగ్స్, సీన్లకు దూరంగా రజనీకాంత్

ఈ మధ్య కాలంలో రజనీకాంత్ తన సినిమాల్లో రొమాంటిక్ డ్యూయోట్లు, సీన్లకు దూరంగా ఉంటున్నారు. తన వయసుకు తగిన విధంగా సినిమా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రజనీ ఆ మధ్య ఓ వేడుకలో స్వయంగా వెల్లడించారు. మరి అలాంటి రజనీకాంత్ సినిమాలో కీర్తి సురేష్ లాంటి యంగ్, హాట్ బ్యూటీ ఎంపిక కావడం చర్చనీయాంశం అయింది.

ఎలాంటి సినిమా ఇది?

ఎలాంటి సినిమా ఇది?

మురుగదాస్ తన సినిమాలో రజనీకాంత్‌ను ముఖ్యమంత్రిగా చూపించబోతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే అది నిజం కాదని దర్శకుడు వివరణ ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X