ఇంట్రెస్టింగ్ న్యూస్: అంతా అనుకున్నట్లుగా చైతూతో సమంత కాదు.. కీర్తి సురేష్..!
సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా విడుదలకు ముందు జరిగే పరిణామాలు ఊహించలేం. హీరోహీరోయిన్ల విషయంలో వస్తున్న వార్తలు ఒక్కోసారి తారుమారు అవుతుంటాయి. తీరా సినిమా షూట్ కి వెళ్లే ముందు ఒకరి ప్లేస్ లోకి మరొకరు వచ్చేయడం తరచుగా జరిగే పరిణామమే. తాజాగా నాగచైతన్య జోడీ విషయంలో అదే జరుగుతోందట. ఊహించని రీతిలో చైతూ భార్య సమంత ప్లేస్ కీర్తిసురేష్ కొట్టేసిందట.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'బంగార్రాజు'. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన కొడుకు నాగచైతన్య, కోడలు సమంత కూడా నటించబోతున్నారని విన్నాం. నాగచైతన్య జోడీగా సమంత నటిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం సమంత ప్లేస్‌లో కీర్తిసురేశ్ పేరు పరిశీలిస్తోందట చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాలంటే మరి కొన్నిరోజులు ఆగాల్సిందే మరి.

మరోవైపు కీర్తి సురేష్.. నాగార్జున తాజా సినిమా 'మన్మథుడు 2' లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. సమంత, కీర్తి సురేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా పూర్తికాగానే 'బంగార్రాజు' సెట్స్ పైకి వెళ్లనున్నారు అక్కినేని నాగార్జున.


Click it and Unblock the Notifications











