రానా తోనా! అయితే నో.. కీర్తి సురేష్ అలా కాదనేసిందా..?

వైవిధ్య భరితమైన కథాంశాలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు దగ్గుబాటి రానా. బాహుబలి సిరీస్‌తో వరల్డ్ ఫేమస్ అయిన ఈ దగ్గుబాటి వారసుడు భారీ అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంటున్నాడు. మరోవైపు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా అంతే. ఇటీవలే 'మహానటి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ఈమె.. రోజు రోజుకూ తన పాపులారిటీ పెంచుకుంటూ వస్తోంది.

కాగా తాజాగా ఈ ఇద్దరికీ సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. రానా దగ్గుబాటి హీరోగా చేయబోతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే కీర్తి సురేష్ తిరస్కరించిందట. దర్శకురాలు నందినీ రెడ్డి, రానాని హీరోగా పెట్టి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతోందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ అయితే బాగుంటుందని భావించిన ఆమె.. కీర్తిని సంప్రదించగా సున్నితంగా 'నో' అనేసిందని సమాచారం.

Keerthy Suresh Says No For Rana Daggubati..?

మాఫియా నేపథ్యంలో సాగే కథను నందినీ రెడ్డి సిద్ధం చేశారని తెలుస్తోంది. ఓ కొరియన్ సినిమాకి రీమేక్‌గా ఈ స్క్రిప్ట్ రెడీ చేసిందట నందినీ. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను రానానే తీసుకున్నాడు. అలాంటి సినిమాను కీర్తి సురేశ్ కాదనడం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో కీర్తి కాదనడానికి కథ నచ్చకపోవడమా? లేక డేట్స్ సర్దుబాటు కాకపోవడమా? అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. కీర్తి కాదనడంతో రానా సరసన నటించేందుకు మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించిందట నందినీ రెడ్డి. చూడాలి మరి చివరకు ఎవరు ఫైనల్ అవుతారో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X