దుబాయ్ వ్యాపారితో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి .. పెళ్లి కొడుకు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బజాలు మోగుతున్నాయి. నటులు, నటీమణులు లేదా మూవీ మేకర్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. తమకు నచ్చిన వారితో మూడు ముళ్ల బంధంతో ఒక్కటై.. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల డైరెక్టర్ క్రిష్ సైలెంట్ మ్యారేజ్ చేసుకోగా.. గాయని రమ్య బెహారా తన తోటి గాయకుడి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇక టాలీవుడ్ హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లల పెళ్లి డిసెంబర్ 4న జరగనుంది. వీరి తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి.. మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టబోతుంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరు? ఆమె పెళ్లి చేసుకోబోదేవరిని?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్. ఈ అమ్మడు కీర్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళ ముగ్గుమ్మ అయినా.. తెలుగులో వరుస విజయాలు అందకుంది. తన అందం, అభినయంతో అదరగొట్టింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది. తెలుగులో ఆమె నటించిన మహానటి సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా వరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు దూరమై.. బాలీవుడ్ , కోలీవుడ్ కు దగ్గర అయింది.

కీర్తి సురేష్ నటి మేనక, నిర్మాత జి. సురేష్ కుమార్ కుమార్తె, 2000లో బాలనటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో చెల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. ఇక 'గీతాంజలి' అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తన నటనతో మెప్పించడంతో ఆమెకు ఉత్తమ నటిగా SIIMA అవార్డును కూడా గెలుచుకుంది. దీంతో ఆమెకు సౌత్ లో మంచి ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ పోతినేని - కిశోర్ తిరుమల కాంబోలో 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంది. ఆ తరువాత నాని, పవన్ కల్యాణ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తరవాత.. కీర్తి సురేష్ కెరీర్‌లో 'మహానటి' సినిమా ఓ మైల్ స్టోన్ గా మారింది. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఈ సినిమాతో కీర్తి సురేశ్ కి పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఈ మూవీ ఆమె కెరీర్ తో భారీ సక్సెస్ అనే చెప్పాలి. కానీ, ఆ సినిమా తరువాత ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు దూరమై.. బాలీవుడ్ , కోలీవుడ్ కు దగ్గర అయింది. ప్రస్తుతం 'బేబీ జాన్' అనే చిత్రంతో నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5 న విడుదల కానున్నది.
ఇదెలా ఉంటే.. గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. కీర్తి సురేష్ పెళ్లి పుకార్లతో వార్తల్లో నిలువడం కొత్తమి కాదు. నెల ప్రారంభంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర తో దిగిన ఫోటో వైరల్ కావడంతో వీరిద్దరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, కథ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారనీ రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ కీర్తి సురేష్ కామెంట్ చేసింది.

తాజాగా..కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు,ప్రియుడు, దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త అంటోనీ తట్టిల్‌తో పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ పెళ్లికి ఇరువురు పేరెంట్స్ అంగీకారం తెలిపారనీ, పెళ్లికి ఓకే చెప్పినట్టు సమాచారం. కీర్తి - అంటోనీ వివాహ వేడుకలు డిసెంబర్ 9న గోవాలో ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో సన్నిహిత కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఈ జాబితాలో రజనీకాంత్, ధనుష్, తలపతి విజయ్, అట్లీ, శివకార్తికేయన్, నాని, పవన్ కళ్యాణ్, వరుణ్ ధావన్, ఉదయనిధి స్టాలిన్‌లతో సహా ప్రముఖ సినీ పరిశ్రమ ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక.. కేరళకు చెందిన అంటోనీ తట్టిల్. ప్రస్తుతం కొచ్చి, దుబాయ్‌లలో పలు వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రముఖ వ్యాపారవేత్త. కైపలాత్ హబీబ్ ఫరూక్‌తో కలిసి చెన్నైలో నమోదైన ఆస్పెరోస్ విండో సొల్యూషన్స్ వన్ ఆఫ్ ఓనర్ అని తెలుస్తోంది. అలాగే.. కేరళ, దుబాయ్‌లలో అంటోనీ తట్టిల్కి కోట్లలో ఆస్తులున్నాయని చెబుతున్నారు. స్కూల్ రోజుల నుంచి కీర్తి- అంటోనీ తట్టిల్ మంచి స్నేహితులు. వీరిద్దరూ కొచ్చిలో డిగ్రీ చదువుతున్నప్పుడు తమ స్నేహం ప్రేమగా మారిందంట. చాలా సంవతర్సాల ప్రేమను ఆమె ఎక్కడా బయటపెట్టలేదు. కీర్తి - అంటోనీల 15 ఏళ్ల ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారంతో వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా మార్చుకోబోతున్నారట. అయితే కీర్తి సురేష్ పెళ్లిపై ఆమె కుటుంబం అధికారికంగా ప్రకటన మాత్రం వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications











