keerthy suresh : కీర్తి సురేష్ షాకింగ్ డెసిషన్? భర్త కోసమే ఇదంతా?
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ ఉన్నటువంటి ప్రముఖ స్టార్ హీరోయిన్స్ ఇపుడు చాలా మందే కనిపిస్తారు. ఈ హీరోయిన్స్‌లో కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్లలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన యంగ్ బ్యూటీస్‌లో నాచురల్ నటి కీర్తి సురేష్ కూడా ఒకామె అని చెప్పాలి. కాగా ఈమె హీరోయిన్‌గా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ప్రస్తుతం అంతగా రాణించడం లేదు.
అటు తెలుగు సహా తన సొంత ఇండస్ట్రీ తమిళ్‌లో కూడా గడ్డు కాలమే ఆమెకి ఎదురయ్యింది. దీనితో ఈ డల్ మూమెంట్‌ని కీర్తి సురేష్ దానికి మించిన హ్యాపీ మూమెంట్ గా అయితే మార్చేసుకుంది అని చెప్పాలి. రీసెంట్‌గా ఆమె తన ప్రేమ కథని అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. తన చిన్న నాటి మిత్రుడు ఆంటోని తట్టిని పరిచయం చేస్తూ తమ ఇద్దరి నడుమ ఎప్పుడు నుంచో ప్రేమాయణం నడుస్తున్నట్లుగా అందరికీ ట్విస్ట్ ఇచ్చింది.

అక్కడి నుంచి పెద్దగా ఆలస్యం చేయకుండగానే కీర్తి సురేష్ పెళ్ళికి కూడా సిద్ధం అయ్యిపోయింది. ఆ వార్తలు ఇలా వచ్చాయో లేదో కేవలం నెల రోజుల్లోనే పెళ్లి చేసుకొని అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. ఈ డిసెంబర్ లోనే తన భర్త ఆంటోనీ తట్టిని గోవాలో ఘనంగా రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు ఈమె చేసుకుంది. వాటిలో ముందుగా హిందూ సంప్రదాయంలో ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకుంది.
కాగా వీరి పెళ్లి పిక్స్ కూడా ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇపుడు తన హిందీ చిత్రం "బేబీ జాన్" కోసం ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ ప్రమోషన్స్ ని ఆమె చేస్తుండగా ఇపుడు ఓ రూమర్ కీర్తి విషయంలో వినిపిస్తుంది. ఇపుడు కీర్తి సురేష్ అయితే ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా వినిపిస్తుంది. అదేమిటంటే కీర్తి సురేష్ ఇకపై సినిమాలకి దూరంగా ఉండబోతుందట.

మరి సినిమాలు వదిలేసినట్టేనా అంటే లేదు సినిమాలకి ఆమె కేవలం ఒక్క ఏడాది మాత్రమే బ్రేక్ ఇవ్వనుందట. మరి ఇదంతా ఎందుకు అంటే తన భర్త కోసమే అట. ఇపుడే పెళ్లయ్యింది కదా వెంటనే వృత్తి పరంగా బిజీగా మారడం ఎందుకు ఒక ఏడాది తన భర్తకి సమయం కేటాయించి తర్వాత ఆమె సినిమాలు చేసుకుంటుందట.
దీనితో ఏడాది వరకు కీర్తి సురేష్ నుంచి ఏ కొత్త సినిమా ఉండకపోవచ్చని చెప్పాలి. ఇప్పుడైతే తాను కేవలం బేబీ జాన్ లోనే బిజీగా ఉండగా ఈ సినిమా ఈ డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా అయినా తనకి హిట్ కావాలని మరీ ముఖ్యంగా హిందీ పరిశ్రమలో మొదటి సినిమా కావడంతో డెబ్యూ సినిమా హిట్ గా అందుకోవాలని చూస్తుంది. మరి చూడాలి తాను కోరుకున్న హిట్ దొరుకుతుందో లేదో అనేది.


Click it and Unblock the Notifications











