మహానటి తరువాత లెజెండరీ సింగర్ బయోపిక్ లో కీర్తి సురేష్?
కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. భాషతో సంబంధం లేకుండా, అసలు హీరోతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వేరే హీరోయిన్లకు షాక్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. హిందీలో బేబీ జాన్ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అట్లీ భారీ హిట్ అందుకోవడంతో.. బాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ అతడి వెంట పాడడం మొదలుపెట్టారు. అందులో వరుణ్ ధావన్ కూడా ఒకడు. ఇక ఈయనేమి రావడం లేదు. తమిళ్ లో ఆయన ఆల్రెడీ విజయ్ తో తెరకెక్కించిన తేరి సినిమానే రేంక్ చేస్తున్నాడు. తెలుగులో ఇదే సినిమా లైన్ తో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ ఏపీ ఎలక్షన్స్ కారణంగా సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో ఈ షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. కానీ, బేబీ జాన్ మాత్రందూసుకుపోతుంది.

ఇక ఈ సినిమాలో కీర్తి .. వరుణ్ తో లిప్ లాక్ కూడా పెట్టడానికి రెడీ అయ్యిందట. ఇక ఇవన్నీ పక్కనపెడితే .. కీర్తి సురేష్ గురించిన ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ వార్త ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.. కానీ, వచ్చిన ప్రతిసారి నిజమేనా అని ఆతృతను మాత్రం తీసుకొస్తుంది. అదేంటంటే.. కీర్తిమరో లెజండరీ సెలబ్రిటీ బయోపిక్ లో నటిస్తుంది అని. ఇప్పటికే సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి, సావిత్రి పాత్రలో నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి.
ఇంకా చెప్పాలంటే ఈ తరం జనరేషన్ కు సావిత్రి అంటే కీర్తి సురేష్ మాత్రమే అనేంతలా ఆమె ఒదిగిపోయింది. ఇక మరోసారి ఆమె బయోపిక్ లో నటిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. లెజండరీ సింగర్ దివంగత ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో కీర్తి నటిస్తుందని అంటున్నారు. ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రం, ఆమె పాడిన పాటలు మర్చిపోవడం చాలా కష్టం.
తమిళనాడులో పుట్టి పెరిగిన ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి ఎలా ఇంత పెద్ద గాయని అయ్యింది.. ? ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు, బయట ప్రపంచానికి తెలియని ఆమె సీక్రెట్స్ వీటన్నింటిని బయోపిక్ లో చూపించనున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఈ బయోపిక్ కు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ ను అధికారికంగా ప్రకటించనున్నారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

ఇక ఈ బయోపిక్ లో కీర్తి నటిస్తుంది అని వార్త రావడంతో అభిమానులు సైతం మంచి ఎంపిక అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహానటి సినిమా తరువాత కీర్తికి అంతటి విజయం అందింది లేదు. ఇక ఈ బయోపిక్ తోనే ఆమె మరో మంచి హిట్ ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందిఅనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడకతప్పదు .


Click it and Unblock the Notifications











