వెంకీ మామకి జతగా క్రేజీ హీరోయిన్.. ఎంతైనా అనిల్ రావిపూడి ప్లానే వేరులే !

టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). తాజాగా సంకాంత్రి బరిలో 'మనశంకర వరప్రసాద్ గారు'తో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ భారీ వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.375 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. ఇలా భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి తరువాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ జోష్ మరోసారి భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

వరుస హిట్లతో 'హిట్ మిషన్'గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. ఈసారి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తో మరోసారి జట్టు కడుతున్నారు. అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబోలో వస్తున్న ఐదో సినిమా కావడం విశేషం. గతంలో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, 'మన శంకర వరప్రసాద్ గారు'వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి.

Keerthy Suresh to Romance Venkatesh in Anil Ravipudi s Next Sankranthi Multistarrer

ఈ ప్రాజెక్ట్‌లో నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కూడా కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా కళ్యాణ్ కెరీర్ కూడా చాలా ముఖ్యమే..'పటాస్' తర్వాత అనిల్ - కళ్యాణ్ రామ్ మళ్లీ కలిసి పని చేయడం కూడా ప్రత్యేకత. దీంతో దగ్గుబాటి - నందమూరి కుటుంబాల హీరోలు ఒకే తెరపై కనిపించనున్నారన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

వెంకీ మామ - కీర్తి సురేష్ జోడీ?
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ (Keerthy Suresh) దాదాపు ఫైనల్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. 'మహానటి'తో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి, గతంలో కమర్షియల్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో తన ప్రతిభను చాటుకుంది. ఇప్పుడు వెంకటేష్ సరసన ఆమె నటించబోతుందనే వార్త ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను అనిల్ రావిపూడి అద్భుతంగా వాడుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఆ సక్సెస్ కాంబోలో కీర్తి సురేష్ కూడా పార్ట్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

సంక్రాంతి సెంటిమెంట్ మళ్లీ?
అనిల్ రావిపూడి సినిమాలకు సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాలు పండగ సీజన్‌లో విడుదలై భారీ వసూళ్లు సాధించాయి. అందుకే ఈ కొత్త మల్టీస్టారర్‌ను 2027 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం - AK 47' నటిస్తున్నారు.

ఆ సినిమా పూర్తయ్యాక అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. ఇప్పటివరకు ఈ సినిమాలోని తారాగణంపై అధికారిక ప్రకటన రాకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న లీకులు మాత్రం అంచనాలను పెంచేస్తున్నాయి. మరి అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడా? వెంకీ మామ - మహానటి జోడీ మ్యాజిక్ చేస్తుందా? అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా ఈ వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగానే ఉండనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X