ప్రముఖ వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి.. ఆ బిలియనీర్ వరుడు ఎవరో తెలుసా?

మహానటి లాంటి ఉత్తమ కథా చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకొంటున్న అందాల భామ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నదనే ప్రచారం దక్షిణాది మీడియాలో ఊపందుకొన్నది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని ఈ జాతీయ ఉత్తమ నటి చేసుకోబోతున్న విషయం చర్చనీయాంశంగా మారింది. కెరీర్ ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న సమయంలో కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోవడం ఏమిటనే ప్రశ్నలు ప్రస్తుతం మీడియాలో వస్తున్నాయి. అయితే ఇంతకు కీర్తి సురేష్ చేసుకోబోయే పెళ్లి కొడుకు ఎవరు అంటే..

Recommended Video

Keerthy Suresh To Marry A VIP's Son?
 అందం, అభినయంతో

అందం, అభినయంతో

అందం, అభినయం రెండు కలిసి ఉన్న యువ హీరోయిన్లలో కీర్తీ సురేష్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సావిత్రి బయోపిక్ మహానటి చిత్రంలో ఆమె అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఈ సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే.

బీజేపీలో కీర్తి సురేష్ తండ్రి కీలకంగా

బీజేపీలో కీర్తి సురేష్ తండ్రి కీలకంగా

ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ఆమె కుటుంబానికి సినీ, రాజకీయ నేపథ్యం ఉంది. తండ్రి సురేష్ వ్యాపారవేత్తనే కాకుండా కేరళ బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తల్లి మేనక కూడా సినీ నటి అనే సంగతి తెలిసిందే. అయితే తమ కుమార్తెకు పెళ్లి చేసి ఓ ఇంటి దాన్ని చేయాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారనేది దక్షిణాది మీడియా రిపోర్టు.

బీజేపీ నేత కుమారుడితో పెళ్లి

బీజేపీ నేత కుమారుడితో పెళ్లి

అయితే బీజేపీ పార్టీలో కీలకంగా కొనసాగుతున్న ఓ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లికి సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆ సంబంధాన్ని ఖాయం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తున్నది. తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు కీర్తి సురేష్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తున్నది. కేరళలో మోస్ట్ వీఐపీ చెలామణి అవుతున్న వ్యాపారవేత్త కోడలి అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.

బిలియనీర్ వ్యాపారవేత్తతో పెళ్లి

బిలియనీర్ వ్యాపారవేత్తతో పెళ్లి

కీర్తి సురేష్ పెళ్లి అరెంజ్డ్ మ్యారేజ్‌గా చేసే పనిలో తల్లిదండ్రులు ఉన్నారని, పెళ్లి కుమారుడి తండ్రితో కీర్తీ తండ్రికి మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండటం కారణంగా ఈ పెళ్లి ఖాయమవుందని సినీ, రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ బిలియనీర్ పెళ్లికొడుకును కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోబోతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ధృవీకరించని కీర్తీ సురేష్ ఫ్యామిలీ

ధృవీకరించని కీర్తీ సురేష్ ఫ్యామిలీ

దక్షిణాది మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా కీర్తీ సురేష్ పెళ్లి విషయం ప్రముఖంగా మారింది. అయితే కీర్తి పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులు ఇంకా ధృవీకరించలేదు. అయితే అధికారికంగా ఈ విషయాన్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు. కీర్తీ సురేష్ కూడా ఈ వార్తలపై పెద్దగా స్పందించకపోవడంతో పెళ్లి వార్తలు నిజమే అనే విధంగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు పూర్తి కాగానే అధికారిక ప్రకటన వెలువడతుందని చెబుతున్నారు.

కీర్తి సురేష్ పెళ్లి వార్తల్లో వాస్తవం లేదు..

కీర్తి సురేష్ పెళ్లి వార్తల్లో వాస్తవం లేదు..

కీర్తీ సురేష్ పెళ్లి వార్తలపై ఆమె సన్నిహిత వర్గాలు కొట్టిపడేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అయిన ఆమె ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి సారిస్తున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దక్షిణాది భాషల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడం అనేది రబ్బిష్ అంటూ కొట్టిపడేస్తున్నారు.

రజనీ, మోహన్‌లాల్‌తో సినిమాలు

రజనీ, మోహన్‌లాల్‌తో సినిమాలు

ప్రస్తుత కీర్తీ సురేష్ చేతి నిండా పలు ప్రాజెక్టులు ఉన్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్న తారగా కీర్తి సురేష్ పలువురు అగ్రహీరోల సరసన నటిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాతే చిత్రంలోను, కార్తీక్ సుబ్బరాజు పెంగ్విన్, మోహన్‌లాల్ నటిస్తున్న మరక్కార్ అరబికదలింటే సింహం, తెలుగులో మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, రంగ్ దే చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X