నాని సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ ఎఫెక్ట్!

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ శైలి ప్రత్యేకం. అందరి హీరోయిన్లలా హద్దులు దాటే గ్లామర్ షోకు కీర్తి సురేష్ దూరం. అయినా కూడా ఈ ఏడాది సౌత్‌లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ అని చెప్పొచ్చు. మహానటి చిత్రంతో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఆ తరువాత సామి 2, పందెం కోడి 2, ఇటీవల ఘనవిజయం సాధించిన విజయ్ సర్కార్ చిత్రాల్లో నటించింది. మరి కొన్ని చిత్రాలతో కీర్తి సురేష్ బిజీగా గడుపుతోంది. కేవలం అద్భుతమైన నటన, పాత్రలో ఒదిగిపోవడం లాంటి కారణాలతోనే కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన బిజీ షెడ్యూల్‌తో నేచరుల్ స్టార్ నాని సినిమానే రిజెక్ట్ చేసిందనే ప్రచారం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది.

నేను లోకల్‌లో జంటగా

నేను లోకల్‌లో జంటగా

నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం నేను లోకల్. చలాకి నటనతో మెప్పించిన కీర్తి సురేష్ ఈ చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్‌కు మరింత చేరువైంది. నేను లోకల్ చిత్రం విజయం సాధించడానికి ప్రధాన కారణం నాని, కీర్తి సురేష్ మధ్య కుదిరిన అద్భుతమైన కెమిస్ట్రీనే. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.

రిజెక్ట్ చేసిందంటూ

రిజెక్ట్ చేసిందంటూ

ఈ సూపర్ హిట్ జంటని మరోమారు నటింపజేయడానికి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ప్రయత్నించారట. చంద్ర శేఖర్ ఏలేటి త్వరలో నాని హీరోగా ఓ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేష్‌ని సంప్రదించారట. సాధారణంగా అయితే నాని సినిమా అనగానే కీర్తి సురేష్ అగీకరించేసి ఉంటుంది. కానీ ఆమె ఓ ప్రత్యేక పరిస్థితిలో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ ఆమేరకు ప్రచారం జరుగుతోంది.

కారణం ఇదేనా

కారణం ఇదేనా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఒక హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని ఎంపిక చేశారు అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి భారీ స్థాయిలో డేట్స్ కేటాయించాల్సి ఉండడం, బిజీ షెడ్యూల్ కారణంగా నాని చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి కూడా తన చిత్రంలో హీరోయిన్లని ఇంకా ప్రకటించలేదు. కీర్తి సురేష్ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది.

భారీ స్థాయిలో తారాగణం

భారీ స్థాయిలో తారాగణం

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందించనున్నారు. ఈ చిత్రంలో తారాగణం కూడా భారీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ప్రారంభమైన కొద్ది రోజులకే జాతీయ వ్యాప్తంగా చర్చ మొదలైంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X