షాకింగ్ .. కీర్తి సురేష్‌కి రెండు పెళ్లిళ్లు

సౌతిండియన్ ఇండస్ట్రీ నుంచి నార్త్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న సౌత్ బ్యూటీస్‌లో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కూడా ఒకరు. సౌత్ లో స్టార్డం చూసేసిన కీర్తి సురేష్ హిట్ స్ట్రీక్ కి ఇపుడు సౌత్ లో బ్రేక్ పడింది. కెరీర్ లో ఎంత ఫాస్ట్ గా తను గ్రో అయ్యిందో ఆ తర్వాత సరైన హిట్ లేక, ఇపుడు మంచి ఆఫర్స్ కూడా లేక స్ట్రగుల్ అవుతుంది. ఇలా హీరోయిన్ గా సౌత్ లో హవా తగ్గడంతో హిందీ సినిమాలోకి వెళ్ళింది కీర్తి సురేష్.

అయితే అక్కడ సినిమా వేగంగా కంప్లీట్ చేసేసి అది రిలీజ్ కి కూడా వస్తున్న తరుణంలో ఊహించని విధంగా తన ప్రేమ అలాగే పెళ్లి విషయం బయటపెట్టి ట్విస్ట్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్లు ప్రేమలో ఉన్నట్టుగా చెప్పి అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. కీర్తి మొదట ప్రేమ వార్తని బయట పెట్టి తర్వాత పెళ్లి విషయం రివీల్ చేసింది.

Keerthy suresh will take marriages with her lover

ఇలా రెండూ స్వయంగా తనే కన్ఫర్మ్ చేయగా ఈ డిసెంబరులోనే తన పెళ్లి ఉంటుంది అని ఆమె వెల్లడించారు. దీంతో మొన్నామధ్య వచ్చిన పెళ్లి పుకార్లు అన్నీ నిజమే అని తేలిపోయింది. ఇక ఇదిలా ఉండగా ఈమె పెళ్లి విషయంలోనే మరో ఆసక్తికరమైన టాక్ ఇపుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

కీర్తి సురేష్ పెళ్లి గోవాలో రెండు రోజులు జరుగుతుంది అని ఆ మధ్య వినిపించిన సంగతి తెలిసిందే. రెండు రోజులు ఎందుకంటే తన వెడ్డింగ్ డే ఒకటి, రిసెప్షన్ రెండు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇపుడు లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఈమె రెండు రోజుల్లో రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటుదట. కాగా కీర్తి సురేష్ ప్రేమించిన వ్యక్తి పేరు ఆంటోనీ అని తెలిసిందే.

Keerthy suresh will take marriages with her lover

మరి తన ఇంటి సంప్రదాయంగా క్రిస్టియన్ మ్యారేజ్ ఒకరోజు అలాగే తమ ఆచారం ప్రకారం హిందూ పద్ధతిలో పెళ్లి ఒకరోజు చేసుకోవాలని కీర్తి సురేష్ భావిస్తున్నారట. ఇలాంటి థీమ్ ని తన పెళ్లికి ఆమెని సెట్ చేసుకున్నట్టుగా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీని ప్రకారం కీర్తి - ఆంటోనీల పెళ్లి ఈ డిసెంబర్ 11 , 12 తేదీల్లో జరుగుతుంది అని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అయితే ఈ డేట్స్ అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఈ సంగతి పక్కన పెడితే కీర్తి సురేష్ నటించిన బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించారు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కీర్తి సురేష్ ఫేవరేట్ హీరో విజయ్ దళపతి నటించిన "తేరి" కి రీమేక్ గా తెరకెక్కించింది. ఈ తమిళ్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ హిందీలో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X