కేక హీరోయిన్ కి గోపీచంద్ రికమండేషన్!?
తేజ దర్శకత్వంలో వచ్చిన కేక చిత్రంతో పరిచయమైన ఇషాని తాజాగా గోపీచంద్ సరసన బుక్కయిందని సమచారం. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందనున్న గోలీమార్ చిత్రం కోసం ఆమెను తీసుకున్నారు. ఇక మొదట ఆ పాత్ర కోసం హన్సికను పూరీ అడిగారు. అయితే హన్సిక తాను అంత తక్కువ రెమ్యునేషన్ కి చేయనని చెప్పకుండా డేట్స్ లేవని తిరస్కరించింది. దాంతో ముంబయి హీరోయిన్స్ ని చాలా మందిని వెతుకుతున్న పూరీకి గోపీచంద్ ..ఇషానిని ఒక్క సారి పరిశీలించమన్నాడుట. హీరో గారు పరిశీలించమంటే కన్ఫర్మే అనే విషయం తెలిసిందే. దాంతో మ్రొక్కుబడిగా ఆమె స్క్రీన్ టెస్ట్ చేసారని, గోలీమార్ లో కొన్ని డైలాగులు ఆమె చేత వల్లె వేయించారని తెలుస్తోంది. ఇక పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని దయానాయక్ నిజ జీవితం ఆధారంగా తీస్తున్నారు. గోపీచంద్ ..ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా కనపించనున్నాడు. ఇంతకు ముందు దయానాయక్ జీవితం ఆధారంగా ఓ కన్నడ చిత్రం వచ్చింది. అది తెలుగులో డబ్బింగ్ కూడా అయింది. ఇక ఇషానీ..కేక చిత్రం అనంతరం ఏ చిత్రమూ చేయలేదు.


Click it and Unblock the Notifications











