అదీ ఆర్ఆర్ఆర్ రేంజ్.. ప్రీ రిలీజ్ కోసం ఏకంగా సీఎం.. మాములుగా లేదుగా!
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మంచి ఆసక్తికరంగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా హాజరవుతున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

భారీగా అంచనాలు
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. అయితే సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్, ఫొటోస్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

కల్పిత కథ ఆధారంగా
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులయిన అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ ల కల్పిత కథ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ అద్భుతమైన యాక్షన్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ముంబై, చెన్నై ఈవెంట్లు
ఆర్‌ఆర్‌ఆర్ విడుదలకు ముందు, మేకర్స్ సినిమా ప్రేక్షకుల కోసం దేశంలో దక్షిణాది నగరాల్లో ఈవెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబై, చెన్నై ఈవెంట్లు జరపగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ బిగ్ బాస్ 15లో వీకెండ్ కవార్‌లో సినిమా ప్రమోషన్ కోసం సందడి చేసింది. షో హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో టీమ్ చాలా సరదాగా గడిపింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కేరళ
ఇక తాజాగా చెన్నైలో ప్రమోషన్స్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ టీం గ్రాండ్ ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కేరళ చేరుకున్నారు. కేరళలో RRRని పంపిణీ చేస్తున్న శిబు థమీన్స్ ఈ రోజు తిరువనంతపురంలోని కొవ్డియార్‌లోని గోల్ఫ్ లింక్స్ రోడ్‌లోని ఉదయ్ ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

ముఖ్య అతిథిగా కేరళ సీఎం
ఈ ఆర్ ఆర్ ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం దేశవ్యాప్తంగా మీడియా కేరళకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేరళ సీఎం పినరయి విజయన్ హాజరవుతున్నట్లు ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. మరి కొన్ని గంటల్లో ఈ ప్రచారం లో ఎంత వరకు నిజం అనేది తెలుస్తుంది?. మరోవైపు, చివరి నిమిషంలో టెన్షన్ లేకుండా చేసుకోవడానికి RRR కంటెంట్ లోడ్ చేయబడింది మరియు డ్రైవ్‌లు USAకి పంపబడ్డాయి. యూఎస్‌లో ఈ సినిమా దాదాపు 999 మల్టీప్లెక్స్‌లలో విడుదలవుతోంది.

విడుదల వాయిదా
జనవరి 7వ తేదీ నుంచి ఆ సినిమా విడుదల వాయిదా వేయవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఓ సారి ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడింది. అయితే, ఈ సారి ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడబోదని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ స్పష్టం చేశారు. 'ఎక్స్‌క్లూజివ్.. బ్రేకింగ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేయట్లేదని ఎస్ఎస్ రాజమౌళి నాకు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా 2022, జనవరి 7నే విడుదల కానుంది' అని తరణ్ ఆదర్శ్ స్పష్టం చేశారు. అలాగే రాజమౌళితో తాను దిగిన ఫొటో ఒకదాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











