ఇది కదా బాలయ్య క్రేజ్ అంటే.. పాన్ ఇండియా మూవీలో కూడా వాడేస్తున్నారుగా!
చిన్న హీరోల సినిమాల్లో పెద్ద హీరోల సినిమాల రిఫరెన్స్ లు లేదా హీరోల రిఫరెన్స్ లు ఉండడం చాలా కామన్. గతంలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి వారి రిఫరెన్స్ లను తమ తమ సినిమాల్లో వాడుకున్నారు కుర్ర హీరోలు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ రిఫరెన్సును ఏకంగా ఒక పాన్ ఇండియా మూవీలో వాడుతున్నారా అనే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళదాం పదండి
బాలయ్య క్రేజ్.. మామూలుగా లేదు: నందమూరి బాలకృష్ణ తండ్రి వారసుడిగానే సీని రంగ ప్రవేశం చేసినా... తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే సృష్టించుకోగలిగాడు. నందమూరి బాలకృష్ణ అంటే చెవులు కోసేసుకునే వాళ్ళు ఉన్నారంటే... అతిశయోక్తి కాదు. ఆయన అభిమానులు కేవలం ఆయన సినిమాలు చూసి వదిలేయడమే కాక ఆయన చేసే సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ వస్తుంటారు.

ఇక గత కొన్నాళ్లుగా ఆయన క్రేజ్ ఇంతింతై ఒకటి ఇంతే అన్నట్టుగా పెరిగిపోతూ వెళుతోంది. ఆయన చేసిన అన్ స్టాపబుల్ షో తర్వాత ఈమధ్య విడుదలైన వీర సింహారెడ్డి సినిమాలు ఆయనకు సూపర్ హిట్లు ఇచ్చాయి.
స్పై రిలీజ్ కు సిద్ధం: అలా మంచి జోష్ మీద ఉన్న బాలయ్య క్రేజ్ ను వాడుకునేందుకు ఒక పాన్ ఇండియా మూవీ యూనిట్ సిద్దమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా మరేమిటో కాదు స్పై. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బీహెచ్ డైరెక్షన్ లో రాజశేఖర్ రెడ్డి కథ అందిస్తూ నిర్మించిన ఈ సినిమా జూలై 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది.
వాస్తవానికి ఈ సినిమా వాయిదా పడుతుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. కానీ 500 మంది పనిచేయాల్సిన చోట 2000 మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులను పనిచేయించి ఎట్టకేలకు సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొని వచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.

బాలయ్య ఫ్యాన్ గా కీలక పాత్ర: తాజాగా సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తారని తెలుస్తోంది. అయితే అది హీరోనా హీరోయిన్ ఆ లేక ఇతర కీలకపాత్ర ఎవరైనా చేశారా అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ సినిమాలో మాత్రం వీరాభిమానిగా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు జై బాలయ్య అనే బిట్టు కూడా వినిపిస్తారని అంటున్నారు. నిజానికి బాలయ్య పేరు వాడుకున్న దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్లయ్యాయి.

ఆ సెంటిమెంటుతో సూపర్ హిట్: ఈ నేపథ్యంలో తమ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలుస్తుంది అని భావిస్తున్నారు ఈ సినిమా యూనిట్. ఇక ఈ మధ్యనే సెన్సార్ ఫార్మాలిటీ స్ఫూర్తి చేసుకున్న స్పై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అంతా సిద్ధమైనట్లుగానే చెప్పాలి.
తెలుగు భాషలో తెరకెక్కిన సినిమాని తమిళ, కన్నడ, హిందీ, భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ పాన్ ఇండియా వైడ్ గా సినిమాని ప్రమోట్ చేసేందుకు పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ... అక్కడి అభిమానులతో టచ్ లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పక్క తెలుగు మీడియాకు కూడా వరుస ఇంటర్వ్యూ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











