twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీడీపీకి షాక్.. వైసీపీ చెంతకు తారక్.. జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు.. మంత్రి రాయబారం

    |

    వరుస విజయాలతో మాంచి ఫామ్ మీద ఉన్నాడు టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్. 2015 నుంచి అతడు చేసిన సినిమాలన్నీ విజయాలు సాధిస్తూనే ఉన్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ప్రస్తుతం తారక్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'RRR'లో నటిస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది.

    ఏపీ ప్రభుత్వంలో బాధ్యతలు

    ఏపీ ప్రభుత్వంలో బాధ్యతలు

    ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కావడంతో ఏ ఆదాయ మార్గాన్నీ వదలకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, తాజాగా దీనికి జూనియర్ ఎన్టీఆర్‌ను బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించాలని యోచిస్తున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది.

    మంత్రి కొడాలి నాని, మామ నార్నే సూచన

    మంత్రి కొడాలి నాని, మామ నార్నే సూచన

    తారక్‌ను పర్యాటక రంగానికి అంబాసీడర్‌గా నియమించాలనుకునే విషయాన్ని, మంత్రి కొడాలి నాని, నార్నే శ్రీనివాసరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, కొందరు సీనియర్ నేతలు కూడా ఇది మంచి ఆలోచన అని సీఎంతో అన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    సుముఖంగానే జగన్

    సుముఖంగానే జగన్

    జూనియర్‌ను అంబాసీడర్‌గా నియమించడానికి ముఖ్యమంత్రి జగన్ సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల రాష్ట్రానికి మంచి జరగడంతో పాటు, రాజకీయంగానూ తమకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉందని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం అవసరమైతే భారీ మొత్తం చెల్లించేందుకైనా ఆయన ఓకే అన్నరనే టాక్ వినిపిస్తోంది.

    తారక్ ఒప్పుకుంటాడా..?

    తారక్ ఒప్పుకుంటాడా..?

    ప్రస్తుతం తారక్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి సినిమా అయిపోయిన వెంటనే అతడు.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సహా మరికొందరితో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. అదీ కాకుండా.. తాత ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని కాదని ఆయన ముందడుగు వేస్తాడా అంటే చెప్పలేని పరిస్థితి.

    ఒప్పుకుంటే టీడీపీకే షాకే

    ఒప్పుకుంటే టీడీపీకే షాకే

    ఒకవేళ తారక్ కనుక పార్టీలను పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఒప్పుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలినట్లే. ఇప్పటికే ఆ పార్టీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తారక్ కనుక ఏపీ ప్రభుత్వం పక్షాన నిలబడితే ఇక టీడీపీ కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

    టీడీపీ తరపున ప్రచారం

    టీడీపీ తరపున ప్రచారం

    తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతో 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖాకీ వస్త్రాలు ధరించి, చైతన్య రథంపై నలుమూలలా తిరుగుతూ తన తాత నందమూరి తారక రామారావును గుర్తు చేశాడు. జూనియర్ ప్రచారానికి భారీ స్పందన కూడా వచ్చింది. కానీ, అప్పుడు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి అతడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు.

    ఎన్టీఆర్ మామకూ పదవి

    ఎన్టీఆర్ మామకూ పదవి

    జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నే శ్రీనివాసరావుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవి లభించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నార్నే శ్రీనివాసరావును వైసీపీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు దగ్గుబాటి హితేష్‌ కూడా ఆ పార్టీలో చేరిన సంగతి విధితమే.

    English summary
    Tollywood Young Hero Jr Ntr Now Working With Rajamouli And Mega Power Star Ram Charan For RRR. At The Same Time Tarak Will be appointed As brand ambassador Andhrapradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X