కింగ్‌ఫిషర్ మోడల్ పై పవన్ కళ్యాణ్ కన్ను?
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'సరదా'(తాత్కాలిక టైటిల్) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్ హీరోయన్‌గా సమంత ఎంపికవగా.....కథ డిమాండ్ మేరకు సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం.....రెండో హీరోయిన్‌గా కింగ్ ఫిషర్ క్యాలెండర్ మోడల్ 'కైరా దత్'ను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2013 సంవత్సరం కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై కైరా దత్ బికినీలు వేసి హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. ఆమె అందాలు హాట్ గా ఉండటం, పవన్ కళ్యాణ్ సరసన సరిజోడిలా ఉండటంతో త్రివిక్రమ్ ఆమెను ఓకే చేసాడని తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై ఓ ప్రకటన వెలువడనుంది.
జనవరి 8 నుంచి 'సరదా' రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేసారు. అయితే పవన్ వెన్ను నొప్పితో బాధ పడుతున్న నేపథ్యంలో డేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ పవన్ తాత్కాలిక ఉపశమనం పొంది షూటింగ్ కు రెడీ అయినా బాడీపై ఎక్కువ ఒత్తిడి పడని సీన్లు మాత్రమే షూట్ చేస్తారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్‍గా చేస్తోంది. సెకండ్ హీరోయిన్ గా కైరా దత్ దాదాపుగా ఓకే అవడంతో ఓ సమస్య తీరినట్టయింది. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు.


Click it and Unblock the Notifications












