twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF2 లేటెస్ట్ అప్డేట్.. సంక్రాంతికి సిద్ధం చేసేలా ఉన్నారు!

    |

    కన్నడ పాన్ ఇండియా సినిమా KGF 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఒక్కసారిగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను కదిలించిన KGF చాప్టర్ 1 సినిమాతో కథానాయకుడు యష్ కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక సెకండ్ చాప్టర్ షూటింగ్ కి కరోనా కాస్త అడ్డుకట్ట వేసినప్పటికి దర్శకుడు ప్రశాంత్ నీల్ వేసుకున్న ప్రణాళికలను బట్టి షూటింగ్ పనులు తొందరగానే ఎండ్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

    లాక్ డౌన్ లోనే ప్రీ ప్రొడక్షన్ పనులను కొన్నిటిని ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కేవలం 25రోజుల షూటింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 15న మళ్ళీ షూటింగ్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లోపల అవుట్ డోర్ కి సంబంధించిన అన్ని పనులను ఫినిష్ చేసుకొని ఆ తరువాత ఇండోర్ లోనే ప్రీ ప్రొడక్షన్ పనులను చూసుకోవాలని అనుకుంటున్నారు.

    Kgf 2 shooting latest update and release date

    ఇప్పటికే చిత్ర యూనిట్ అందుకోసం స్పెషల్ ప్లాన్ ని రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక KGF 2 పనుల స్పీడ్ చూస్తుంటే సినిమా తొందరగానే రెడీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దసరాకి కూడా సిద్ధం కావచ్చు. కుదిరితే సంక్రాంతికి కూడా రిలీజ్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న సమస్యం ఒక్కటే. కరోనా కాలంలో థియేటర్స్ ఓపెన్ అయినా కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరి ఊహలకు అర్థం కావడం లేదు.

    పైగా ఓటీటీల హవా ఎక్కువవ్వడంతో థియేటర్స్ ని మరచిపోయో పరిస్థితి ఏర్పడింది. KGF 2 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది కాబట్టి వీలైనంత వరకు సేఫ్ జోన్ అనుకుంటేనే థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ పాన్ ఇండియా సినిమా విడుదలైన తరువాత అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

    English summary
    Kgf 2 shooting latest update and release date
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X