'ఆది పురుష్' కోసమే ప్రభాస్ ఆ దర్శకుడికి హ్యాండ్ ఇచ్చాడా?
రెబల్ స్టార్ ప్రభాస్ స్థాయి బాలీవుడ్ లో మరింత పెంచేలా అసలైన సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ జనాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలియదు గాని ఆ సినిమాను మాత్రం అక్కడి స్టార్స్ కుళ్ళుకునేలా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు అర్ధమవుతోంది. ఏకంగా 500కోట్ల బడ్జెట్ తో ఖాన్ త్రయానికి కూడా సాధ్యపడని సినిమా చేస్తున్నారు.
సౌత్ మార్కెట్ కూడా పెరగడంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు పాన్ ఇండియా హీరోలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ముందు జాగ్రత్తగా ఓం రావత్ ప్రభాస్ తో ఆది పురుష్ కథను సెట్ చేసుకున్నాడు. రామాయణం బ్యాక్ డ్రాప్ లోనే ఆ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇటీవల రాజమౌళి కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ప్రభాస్ ఆ సినిమాకు ఒకే చేయకముందే చాలా మంది దర్శకులను పెండింగ్ లో పెట్టాడట.

KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా భవిష్యత్తులో పెద్ద హీరోలు అంత ఈజీగా దొరకరని ఓ వైపు తారక్ ని ఒప్పిస్తూనే ఎప్పటి నుంచో ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ తో ఒక పాయింట్ గురించి మాట్లాడినప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. మళ్ళీ తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పై మాట్లాడదమని చెప్పిన కొన్ని రోజులకే ఆది పురుష్ ఎనౌన్స్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో మాత్రం మళ్ళీ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలిసే అవకాశం ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇంకా నాగ్ అశ్విన్ సినిమాతో పాటు రాధే శ్యామ్ కూడా ఉంది. సో ఈ మూడు పూర్తి చేసిన తరువాత ప్రశాంత్ చెప్పిన ప్రాజెక్ట్ తెరపైకి అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











