బాహుబలిని తలదన్నేలా ప్రశాంత్ నీల్ బడా ప్రాజెక్ట్.. ఆ హీరో తప్పితే మరో ఆప్షన్ లేదు

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అగ్ర హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టడంతో ముందుగా ఏ సినిమా వస్తుందో అనే విషయంపై నిత్యం ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా KGF 2 రాకముందే ఫ్యూచర్ ప్రాజెక్టులపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాడు. త్వరలో బాహుబలి కంటే హై రేంజ్ లో సినిమాను ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం.

Recommended Video

Salaar కి Baahubali ఫార్ములా, Prabhas కి డైలాగ్స్ తక్కువ Prashant Neel స్కెచ్ || Filmibeat Telugu
మళ్ళీ రాజమౌళి వల్లే అవుతుంది

మళ్ళీ రాజమౌళి వల్లే అవుతుంది

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తీసిన అనంతరం మళ్ళీ ఆ సినిమాను కొట్టే స్థాయిలో మరో సినిమా రాలేదు. ఇక మళ్ళీ రాజమౌళి ద్వారానే RRR ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలు కూడా కొన్ని అంతకంటే హై రేంజ్ లో సిద్ధమవుతున్నాయి. కానీ ఇప్పటికే RRR ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాహుబలిని మించిపోయింది కాబట్టి తప్పకుండా బాహుబలి రికార్డులను మొదట జక్కన్న ద్వారా బ్రేక్ అవుతాయని తెలుస్తోంది.

బహుబలి కంటే హై రేంజ్ లో

బహుబలి కంటే హై రేంజ్ లో

అసలు మ్యాటర్ లోకి వెళితే.. బాహుబలి కంటే హై రేంజ్ లో సినిమాను తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ కూడా అనుకోకుండా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మైథలజికల్ కథను కూడా సెట్ చేసుకున్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది. ఆ సినిమాకు బడ్జెట్ కూడా బాహుబలి కంటే ఎక్కువగానే అవుతుందట.

ప్రభాస్ తోనే చేయాలని..

ప్రభాస్ తోనే చేయాలని..

ఇక అలాంటి సినిమా చేస్తే ప్రభాస్ తోనే చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి కమ్మిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సలార్ అయిపోగానే ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయనున్న ప్రశాంత్ ఆ తరువాత ప్రభాస్ తో కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

దిల్ రాజుతో కలిసి..?

దిల్ రాజుతో కలిసి..?

బాహుబలి తరహాలోనే రాజ్యాలు కోటలు అలాగే యుద్ధాలు వంటి అంశాలు హైలెట్ అయ్యేలా హేవి ఎమోషన్స్ తో కథను రెడీ చేస్తున్నాడట. ఇక ఆ సినిమాను దిల్ రాజు అలాగే మరో బడా నిర్మాత సంయుక్తంగా తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF 2ను ఈ ఏడాది డిసెంబర్ లోనే క్రిస్టమస్ కానుకగా విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X