కెజిఎఫ్ డైరెక్టర్‌తో చర్చలు.. మహేష్ బాబు నుంచి ప్యాన్ ఇండియా మూవీ?

Recommended Video

KGF Director Prashanth Neel Next Film With Mahesh Babu..?? | Filmibeat Telugu

మంచి కంటెంట్ ఉంటే సౌత్ స్టార్స్ నటించిన సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతాయని బాహుబలి, బాహుబలి 2తో నిరూపితం అయింది. దీంతో పాటు కన్నడ నటుడు యష్ నటించిన 'కెజిఎఫ్' కూడా హిందీతో పాటు అన్ని భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది. మరో వైపు ప్రభాస్ 'సాహో'తో, రామ్ చరణ్, ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'తో ప్యాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు కూడా కేవలం తెలుగు రాష్ట్రాలకు లేదా సౌత్ ఇండియాకే పరిమితమైన సినిమాలకే పరిమితం కాకుండా ప్యాన్ ఇండియా లెవల్ మూవీస్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. ఈ క్రమంతో ఆ స్థాయి చిత్రాలు తీయగల దర్శకులు మంచి కథతో ముందుకు వస్తే తాను చేయడానికి సిద్ధమనే సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.

నమ్రతను కలిసిన ప్రశాంత్ నీల్

నమ్రతను కలిసిన ప్రశాంత్ నీల్

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘కెజిఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల మహేష్ బాబు భార్య నమ్రతను కలిసి తన వద్ద ఉన్నకథ చెప్పినట్లు సమాచారం. ‘కెజిఎఫ్ 2' తర్వాత తాను చేయాలనుకుంటున్న స్టోరీని నమ్రతకు వివరించారట.

నమ్రతకు నచ్చింది, కానీ...

నమ్రతకు నచ్చింది, కానీ...

ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్ నమ్రతకు నచ్చిందని, త్వరలోనే పూర్తి స్టోరీ ప్రిపేర్ చేసి మహేష్ బాబుకు వినిపించనున్నారని సమాచారం. ఆయన చెప్పే కథతో సూపర్ స్టార్ సంతృప్తి చెందితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

మహేష్ బాబు సొంత బేనర్లోనే...

మహేష్ బాబు సొంత బేనర్లోనే...

ప్రశాంత్ నీల్ చెప్పే కథ నచ్చితే ‘మహేష్ బాబు 27'గా ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది. దీన్ని తమ సొంత ప్రొడక్షన్స్ ‘జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్' పతాకంపై నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మహేష్ బాబు

మహేష్ బాబు

ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ చిత్రం ‘మహర్షి'.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన తన 26వ చిత్రం ‘ఎఫ్ 2' ఫేం అనిల్ రావిపూడితో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X