మరోసారి బిగ్గెస్ట్ బాలీవుడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన యష్.. ఎందుకంటే?
కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రాకింగ్ స్టార్ యష్. కేజీఎఫ్ లో యష్ పోషించిన రాఖీభాయ్ పాత్ర నార్త్ ఇండియాలో అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత యష్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ ని ఒకే చేయలేదు. చాలా మంది దర్శకులు కథలు వినిపించిన రాఖీభాయ్ ని బీట్ చేసే విధంగా లేకపోవడంతో తిరస్కరించాడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ లో దర్శకులు ఇతిహాస కథలపై పడ్డారు. ఈ నేపథ్యంలో రామాయణం కథని నాలుగు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. మధు మంతెన నిర్మాతగా నితీష్ తివారి, రవి ఉద్యవార్ ద్వయం దర్శకత్వంలో ఈ సిరీస్ సిద్ధం అవుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీలో శ్రీ రాముడిగా రణబీర్ కపూర్ ని అనుకుంటున్నారు.

ఇక రావణుడి పాత్ర కోసం తాజాగా రాకింగ్ స్టార్ యష్ ని చిత్ర యూనిట్ సంప్రదించిందంట. అయితే పాన్ వరల్డ్ రేంజ్ లో నాలుగు భాగాలుగా తెరకెక్కించబోయే ఈ ప్రాజెక్ట్ లో రావణుడి పాత్ర చేయడానికి యష్ ఒప్పుకోలేదంట. ఓ విధంగా బాలీవుడ్ సినిమా అంటే కచ్చితంగా యష్ కెరియర్ లో అది చాలా ప్లస్ అవుతుంది. కాని ప్రతినాయకుడి పాత్రలో నటిస్తే మరల హీరోగా తన ఇమేజ్ కి ఇబ్బంది అవుతుందని యష్ భావించాడంట.
ఈ నేపథ్యంలో వారి ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించడం జరిగిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం యష్ నార్తన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే మలయాళీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. దాంతో పాటు కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని నిర్మాత విజయ్ కిరంగదూర్ క్లారిటీ ఇచ్చారు. మరి వీటిలో యష్ దేనిని ముందు స్టార్ట్ చేస్తాడనేది తెలియాల్సి ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత బిగ్ స్క్రీన్ పై యష్ ని చూడటానికి ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











